Mobile Game: గేమ్ ఆడుతుండగా ఫోన్ లాక్కున్న తల్లి.. క్షణికావేశంలో బాలుడు ఏం చేశాడంటే..?

|

Jun 10, 2022 | 7:09 AM

దిండోషి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం బాలుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతుండగా.. చదుకోవాలంటూ అతని తల్లి ఫోన్‌ తీసుకుంది.

Mobile Game: గేమ్ ఆడుతుండగా ఫోన్ లాక్కున్న తల్లి.. క్షణికావేశంలో బాలుడు ఏం చేశాడంటే..?
Online Games
Follow us on

Mumbai boy dies by suicide: ఆన్‌లైన్ గేమ్స్ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతుండగా.. తన తల్లి ఫోన్‌ లాక్కుందన్న కారణంతో 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. దిండోషి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం బాలుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతుండగా.. చదుకోవాలంటూ అతని తల్లి ఫోన్‌ తీసుకుంది. దీంతో కోపానికి గురైన బాలుడు.. సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో లేఖను గుర్తించిన తల్లి దాన్ని చదివింది. తాను ఆత్మహత్య చేసుకొనేందుకు ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని.. ఇక ఎప్పటికీ తిరిగిరానంటూ బాలుడు లేఖలో పేర్కొన్నాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు దిండోషి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడు ఆచూకీ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో గాలించారు.

ఈ క్రమంలో మలాద్‌- కందివాలి రైల్వే స్టేషన్ల మధ్య ఎవరో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు విచారణ జరిపారు. సూసైడ్‌ చేసుకున్నది ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడేనని గుర్తించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బొరివాళి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..