దారుణం.. కూతురు పుట్టిందని చంపేసింది..! ఎలా చంపాలో స్మార్ట్‌ఫోన్‌లో వెతికింది..

Crime News: కొడుకు పుడుతాడని అనుకుంటే కూతురు పుట్టినందుకు దారుణంగా చంపేసింది. మూడు నెలల చిన్నారిని నీళ్లలో ముంచి హత్య చేసింది.

దారుణం.. కూతురు పుట్టిందని చంపేసింది..! ఎలా చంపాలో స్మార్ట్‌ఫోన్‌లో వెతికింది..
Crime News

Updated on: Oct 23, 2021 | 10:26 PM

Crime News: కొడుకు పుడుతాడని అనుకుంటే కూతురు పుట్టినందుకు దారుణంగా చంపేసింది. మూడు నెలల చిన్నారిని నీళ్లలో ముంచి హత్య చేసింది. ఈ సంఘటన మద్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయినిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతి అనే మహిళకు గర్భం దాల్చినప్పటి నుంచి కుమారుడు కావాలిన ఉండేది. ప్రసవం అయిన తర్వాత కూతురు పుట్టిందని తెలిసింది. అప్పటి నుంచి ఆ పసికందుపై ద్వేషం పెంచుకుంది.

తనను దగ్గరకు కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. వారి బంధువులే ఆ పసిపాప ఆలనపాలన చూశారు. ఇదే సమయంలో ఆమె భర్త కొత్త మొబైల్‌ కొనిచ్చాడు. అందులో ఆమె ఆ మూడు నెలల చిన్నారిని ఎలా చంపాలో వెతికింది. శరీరంపై గాయాలు కాకుండా చంపే విధానం గురించి సెర్చ్ చేసింది. చివరకు అక్టోబర్‌ 12న నీటి తొట్టెలో ముంచేసి చంపేసింది. స్వాతి ప్రవర్తన గమనించిన కొందరు ఆమె చంపి ఉంటుందని అనుమానించారు.

పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంది. అయితే పోలీసులు స్వాతి.. పసిపాపని చంపినట్లు ఆధారాలు కూడా సేకరించారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 24 గంటలపాటు రిమాండ్ విధించింది.

Boiled Lemon: ఉడికించిన నిమ్మకాయలో అద్భుత ఔషధ గుణాలు..! ఈ 5 సమస్యలకి చక్కటి పరిష్కారం..

T20 World Cup: పాకిస్తాన్‌ భరతం పట్టనున్న టీమిండియా.. ఆ వరల్డ్‌కప్ హీరోస్‌లో ఇప్పుడు ఆడేది ముగ్గురే.!

Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. యాక్షన్ హీరోకే పోటీ.. దుమ్ములేపుతున్న వీడియో.!