పుట్టకముందే శిశువుని అమ్మకానికి పెట్టిన అమ్మ.. పుట్టిన తర్వాత ఎవరో ఎత్తుపోయారని నాటకం.. ఎక్కడో తెలుసా..!
బరువు అనుకుందో.. భారం అనుకుందో తెలియదు కానీ కన్నకూతురినే అమ్మకానికి పెట్టిందో తల్లి. అయితే తనపాపను ఓ మహిళ తీసుకుందని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. కృష్ణా జిల్లాకు చెందిన మున్నీ..
Mother Wants to Sell Born Baby: బరువు అనుకుందో.. భారం అనుకుందో తెలియదు కానీ కన్నకూతురినే అమ్మకానికి పెట్టిందో తల్లి. అయితే తనపాపను ఓ మహిళ తీసుకుందని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. కృష్ణా జిల్లాకు చెందిన మున్నీ అనే మహిళ.. ప్రసవానికి ముందే తన కడుపులో ఉన్న బిడ్డను అమ్మకానికి పెట్టింది. 4 లక్షల బేరం కుదుర్చుకుంది. తీరా ఆపరేషన్ తర్వాత బిడ్డను వారి చేతిలో పెట్టి ఆ తర్వాత తనకేమీ తెలియదని, ఎవరో పాపను తీసుకున్నారని చెబుతోంది. నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కోదాడలో మాతృశ్రీ పేరుతో టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్న మహాలక్ష్మి అనే మహిళ ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీకి పిల్లలు లేకపోవడంతో పాప కోసం ప్రయత్నించారు. అదే సమయంలో గర్భవతిగా ఉన్న మున్నీ అనే మహిళ గురించి తెలుసుకుంది మహాలక్ష్మి. అప్పటికే ఆమెకు పిల్లలున్నారని, అధిక సంతానాన్ని పోశించే స్థోమత లేదని తెలుసుకున్న మహాలక్ష్మి, పాపను 4 లక్షలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకుంది. ఆపరేషన్ తర్వాత పాప తండ్రి చేతిలో డబ్బుల పెట్టి పాపను తీసుకున్నానని, ఆ తర్వాత ఖమ్మం నుంచి వచ్చిన ఫ్యామిలీకి అప్పగించానని చెబుతోంది మహాలక్ష్మి. అయితే పసిపాప అమ్మకం కేసులో దర్యాప్తు చేస్తున్నారు నందిగామ పోలీసులు. ఏది నిజమో తెలుసుకునే పనిలో పడ్డారు.
Also Read: