కసాయి తల్లిః ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది.. సహజీవనానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కూతుర్ని చంపేసింది..

|

Jun 03, 2021 | 8:59 PM

ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది. భర్తకు దూరంగా కూతురిని తీసుకొని వెళ్లింది. ఆ కసాయి తల్లికి కన్న కూతురు కూడా భారమైంది. మూడేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చింది.

కసాయి తల్లిః ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది.. సహజీవనానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కూతుర్ని చంపేసింది..
Mother Killed A Three Year Old Daughter
Follow us on

Mother Killed a Three Year Old Daughter: ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది. భర్తకు దూరంగా కూతురిని తీసుకొని వెళ్లింది. ఆ కసాయి తల్లికి కన్న కూతురు కూడా భారమైంది. మూడేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసింది. మానవత్వం మంట కలిసిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది.

విశాఖ జిల్లా మధురవాడ సమీపంలోని మారికవలసలో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల చిన్నారిని సొంత తల్లే చంపింది. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఊరి చివరన ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు కూడా చేసింది. చిన్నారి కనిపించకపోవడంతో స్థానికులు నిలదీశారు. నిందితురాలు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి తల్లిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు భాగోతం బయటకు వచ్చింది.

మారికవలస ప్రాంతానికి చెందిన వరలక్ష్మీ కట్టుకున్న భర్తను వదిలేసింది. వరలక్ష్మి కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరి వివాహేతర సంబంధానికి మూడేళ్ల చిన్నారి అడ్డుగా ఉండటంతో వదిలించుకోవాలనుకుంది. ఇదే క్రమంలో చిన్నారిని చంపేసి సమాధి చేశారు. అయితే, చిన్నారి అనారోగ్యంతో మృతి చెందిందని ఆమె స్థానికులతో చెప్పింది. అయితే తమ కళ్ల ముందే తిరుగుతున్న చిన్నారి ఎప్పుడు ఆనారోగ్యానికి గురైందని వారు నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వరలక్ష్మితో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో వరలక్ష్మి పాపను హత్యచేసి ఖననం చేసినట్లుగా ఒప్పుకుంది. దీంతో ఆమెను స్మశానవాటికకు తీసుకెళ్లి ఎమ్మార్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విచారణలో భాగంగా పోలీసులు వరలక్ష్మిని గ్రామంలోకి తీసుకురావడంతో గ్రామస్తులు ఆమెపై దాడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

Read Also… Murder: సలాడ్ లేటయ్యిందని భార్యను చంపిన భర్త.. కుమారుడిపై కూడా కొడవలితో దాడి..