మాతృత్వానికే మాయని మచ్చ.. కన్నతల్లే సొంత బిడ్డను..

మాతృత్వానికే కాదు మానవ జాతికే ఒక మాయని మచ్చగా నిలిచింది ఈ ఘటన. విజయవాడ మొగల్రాజపురంలో నివసిస్తున్న దంపతులకు ఓ కుమార్తె (15) ఉంది. అయితే వివాహమైన తర్వాత మనస్పర్థలు వచ్చి ఈ దంపతులు విడిపోయారు. దీంతో… తండ్రి కూతురు కలసి బాలిక వాళ్ళ నాయనమ్మ ఇంట్లో నివాసముంటున్నారు. అయితే బాలిక వాళ్ల తాతయ్య కొద్దినెలలుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం అతని పరిస్థితి విషమించడంతో… అతనిని సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే […]

మాతృత్వానికే మాయని మచ్చ.. కన్నతల్లే సొంత బిడ్డను..

Updated on: Dec 08, 2019 | 12:12 PM

మాతృత్వానికే కాదు మానవ జాతికే ఒక మాయని మచ్చగా నిలిచింది ఈ ఘటన. విజయవాడ మొగల్రాజపురంలో నివసిస్తున్న దంపతులకు ఓ కుమార్తె (15) ఉంది. అయితే వివాహమైన తర్వాత మనస్పర్థలు వచ్చి ఈ దంపతులు విడిపోయారు. దీంతో… తండ్రి కూతురు కలసి బాలిక వాళ్ళ నాయనమ్మ ఇంట్లో నివాసముంటున్నారు. అయితే బాలిక వాళ్ల తాతయ్య కొద్దినెలలుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం అతని పరిస్థితి విషమించడంతో… అతనిని సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక తండ్రి కూడా సికింద్రాబాద్ కు వెళ్ళాడు. కానీ వెళ్లేటప్పుడు తండ్రి బాలికను తల్లి దగ్గర 15 రోజులు ఉండమని విడిచి వెళ్ళాడు.

ఈ క్రమంలోనే తల్లిలోని పైశాచికత్వం బయటపడింది. ఆమె ఇద్దరితో చనువుగా ఉంటుంది. కూతురు ఇంటికి వచ్చేసరికి… ఆమెలోని నీచత్వం బయటపడి తాను చనువుగా ఉండే ఇద్దరిని బాలికతో అసభ్యంగా ప్రవర్తించమని చెప్పింది. ఒక రోజు తన కూతురు స్నానం చేసేటప్పుడు…ఆ తల్లి దొంగ చాటుగా ఫోటోలు తీసింది.. ఆ తర్వాత కూతురు బట్టలు మార్చుకునేటప్పుడు కూడా ఫోటోలు తీసి సాగర్, రమేశ్ లకు పంపించింది. దీంతో ఆ ఇద్దరూ బాలికను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అయినా బాలిక ఒప్పుకోకపోవడంతో… తండ్రిని చంపుతామని బెదిరించారు.

తండ్రి తిరిగి రాగానే జరిగిందంతా చెప్పి భోరున విలపించింది. ఆ తండ్రి బాలికను శనివారం మాచవరం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. తల్లితో పాటు… ఇద్దరు వ్యక్తులపై పోలీసులు పలు సెక్షన్ల కింద, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us