ATM దోపిడీల్లో కోట్ల సొమ్మును లూటీ చేసిన క్రిమినల్ అరెస్ట్‌! 200 మంది ఎదురుదాడి..

|

Feb 24, 2022 | 1:24 PM

హర్యానాలోని పాల్వాల్ సమీపంలోని ఆండ్రౌలా గ్రామం (Andraula village)లోకి ప్రవేశించాలంటే స్థానిక పోలీసులకు హడల్‌! ఎందుకంటే దాదాపు ఓ గ్రామ ప్రజలందరూ నేరస్థుడిని ఎల్లప్పుడూ రక్షణ కవచంలా కాపాడుతుంటారు..

ATM దోపిడీల్లో కోట్ల సొమ్మును లూటీ చేసిన క్రిమినల్ అరెస్ట్‌! 200 మంది ఎదురుదాడి..
Atm Criminal Khurshid
Follow us on

Chambal Police’s courage: దేశవ్యాప్తంగా పలు ఏటీఎమ్‌ సెంటర్లను దోపిడీ చేసి కోట్ల సొమ్మును కొల్లగొట్టిన దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గ్వాలియర్-చంబల్ పోలీసులు క్రిమినల్ ఇంట్లోకి ప్రవేశించి భారీ స్థాయిలో కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు. ఐతే ఇదేమీ ఇంత సులువుగా జరగలేదు. హర్యానాలోని పాల్వాల్ సమీపంలోని ఆండ్రౌలా గ్రామం (Andraula village)లోకి ప్రవేశించాలంటే స్థానిక పోలీసులకు హడల్‌! ఎందుకంటే దాదాపు ఓ గ్రామ ప్రజలందరూ నేరస్థుడిని ఎల్లప్పుడూ రక్షణ కవచంలా కాపాడుతుంటారు. గ్రామాన్నే రక్షణ దళంగా మలుచుకున్న సదరు నేరస్తుడిని పట్టుకోవడానికి, గ్వాలియర్-చంబల్ పోలీసులు పట్టపగలు గ్రామంపై దాడిచేసి ఎట్టకేలకు బంధించారు. నేరస్తుడు ఖుర్షీద్ దేశవ్యాప్తంగా పలు ఏటీఎమ్‌ లూటీలలో పేరుమోసిన క్రమినల్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే అతన్ని అరెస్టు చేసిన వారికి 25 రూపాయల రివార్డు కూడా ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పోలీసుల కథనం ప్రకారం..

గ్వాలియర్‌లో శనివారం (ఫిబ్రవరి 19) రాత్రి దుండగులు నగరంలోని 3 ఏటీఎమ్‌ మెషిన్లను కత్తిరించి సుమారు 44 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఏటీఎంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గ్వాలియర్ క్రైం బ్రాంచ్ నిందితులను గుర్తించే పనిలో పడింది. ఈ నెల్లోనే మొరెనా, శివపురిలోని ఏటీఎంలలో కూడా ఇలాంటి చోరీ ఘటనలు జరిగినట్లు క్రైం బ్రాంచ్‌కు సమాచారం అందింది. దీంతో గ్వాలియర్ పోలీస్‌ బృందం మొరెనాకు చేరుకోగా చోరీలన్నీ ఒకే విధంగా ఉండటంతో, గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ – మోరెనా పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏటీఎం దోపిడీకి పాల్పడిన దుండగుడు హర్యానాలోని పల్వాల్ జిల్లా ఆండ్రౌలా గ్రామానికి చెందిన ఖుర్షీద్ అని దర్యాప్తులో తేలడంతో పోలీసులు దాడికి రంగం సిద్ధం చేశారు. అనంతరం క్రైమ్‌ బ్రాంచ్‌ డీఎస్పీ విజయ్‌ భదౌరియా నేతృత్వంలో 8 మంది, మొరెనా నుంచి 8 మంది పోలీసులతో కూడిన బృందం ప్రణాళికాబద్ధంగా స్పాట్‌కు చేరుకుంది. మంగళవారం (ఫిబ్రవరి 22) మధ్యాహ్నం 2 గంటల30 నిముషాలకు ఖుర్షీద్ దాక్కున్న ఆండ్రౌలా గ్రామంలోకి పోలీసు బృందాలు ప్రవేశించాయి.

దాడి సమయంలో.. ఆండ్రౌలా గ్రామంలో ఖుర్షీద్‌కు ఆశ్రయం కల్పించిన 200 మంది గుంపుగా గ్వాలియర్-చంబల్ పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో మహిళలు, పిల్లలు కూడా పాల్గొన్నారు. గ్రామస్తులు పోలీసులను చుట్టుముట్టి కాల్పులు జరపడంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురు కాల్పులు జరిపి, ఖుర్షీద్ ఉన్న ఇంట్లోకి ప్రవేశించి, నిందితుడిని పట్టుకుని పోలీసుల వాహనంలో తరలించారు. నిందితుడు ఖుర్షీద్‌, గ్వాలియర్-చంబల్ ప్రాంతాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా అనేక ఏటీఎంలను లూటీ చేసి కోట్లాది రూపాయలను దోచుకున్న సంగతి తెలిసిందే. సేకరించిన సమాచారం ప్రకారం.. సదరు గ్రామం ముస్లిం ప్రాబల్యం ఉన్న ఏరియా అని, గ్రామ ప్రజలందరూ ఏటీఎమ్‌లను కట్‌ చేయడంలో నిపుణలని పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు. విచారణ సమయంలో మొరెనా, షియోపూర్, అస్సాం, నోయిడా, అల్వార్‌లలో నేరాలు చేసినట్లు ఖుర్షీద్ అంగీకరించినట్లు మీడియాకు తెలిపారు.

Also Read:

Knowledge: మద్యం సేవించగానే అందుకే కంట్రోల్‌ తప్పుతారు! లివర్‌ ఫెయిల్‌ అవ్వడానికి కూడా కారణం ఇదే..