Video: మూడేళ్ల క్రితం స్టోరీ మళ్లీ..! ఒకే వ్యక్తి చేతిలో మూడు సార్లు మోసపోయిన వ్యక్తిని ఎం అంటారు..?(వీడియో)
ఫేస్‌బుక్‌లో పరిచయంతో ఆ ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. పరిచయమైన వ్యక్తి.. టూర్ కి వెళదామంటూ మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసి డబ్బు వసూలుకు పాల్పడుతున్నాడు. ఇలా ఒక్కసారి కాదు.. ఏకంగా రెండు సార్లు జరిగింది. అదేంటీ అనుకుంటున్నారా..?
ఫేస్‌బుక్‌లో పరిచయంతో ఆ ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. పరిచయమైన వ్యక్తి.. టూర్ కి వెళదామంటూ మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసి డబ్బు వసూలుకు పాల్పడుతున్నాడు. ఇలా ఒక్కసారి కాదు.. ఏకంగా రెండు సార్లు జరిగింది. అదేంటీ అనుకుంటున్నారా..? మూడేళ్ల క్రితం జరిగిన స్టోరీ మళ్లీ రిపీటైంది. ఈ ఘటనల్లో బాధితుడు ఒక్కడే.. నిందితుడు కూడా పాత వ్యక్తే. అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.. గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం అంగలకుదురులో ఉంటున్న వ్యక్తికి.. హైదరాబాద్ లో ఉంటున్న సూర్య అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. బాపట్ల సూర్యలంక బీచ్‌కి తన స్నేహితులతో వస్తున్నానని, అక్కడికి రావాలంటూ సూర్య బాధితుడిని ఆహ్వానించాడు. అంతేకాదు… సూర్యలంక వెళ్లేందుకు తెనాలి వచ్చిన సూర్య కారులో బాధితుడు ఎక్కాడు.. అయితే సూర్యలంక కాకుండా అదే కారులో హైదరాబాద్ తీసుకెళ్లి బాధితుడిని కిడ్నాప్ చేశారు. 50వేల రూపాయలు డిమాండ్ చేశాడు నిందితుడు. తన తల్లికి చెప్పి గూగుల్ పే చేయించాడు బాధితుడు.. అయితే ఇది జరిగి మూడేళ్లు… కాకపోతే అదే సూర్య మహిళా ప్రొఫైల్‌తో మరోమారు బాధితుడికి పరిచయమయ్యాడు.జనవరి18 న సూర్యాపేట రావాలని, నిన్ను కలవాలని ఉంది అని చెప్పగానే, సూర్యాపేట వెళ్ళాడు బాధితుడు.. అయితే అక్కడ సూర్యని చూడగానే అవాక్కయ్యాడు బాధితుడు. మరలా కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ సారి 55వేల రూపాయలు గుంజాడు సదరు కేటుగాడు. అక్కడి నుంచి తప్పించుకుని తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..