Nalgonda District: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. డీజే ఆపించారని కొంతమంది యువకులు ట్రైనీ ఎస్సైపై దాడికి పాల్పడ్డారు. లాక్‌డౌన్ సమయంలో అర్ధరాత్రి డీజే పెట్టి డ్యాన్స్ వేస్తున్న యువకులను ట్రైనీ ఎస్‌ఐ అడ్డుకోగా దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన జిల్లాల్లోని డిండి మండలం బురాన్‌పూర్ తండాలో జరిగింది. పెట్రోలింగ్‌లో భాగంగా రాత్రి సిబ్బందితో కలిసి ట్రైనీ ఎస్‌ఐ కిరణ్.. సోమవారం రాత్రి బురాన్‌పూర్ తండాకు వెళ్లారు. ఈ క్రమంలో వివాహ వేడుకలో గుంపులుగా డీజేలతో యువకులు నృత్యాలు చేస్తున్నారు.
అక్కడకు చేరుకున్న ఎస్ఐ కిరణ్ అనుమతి లేదంటూ డీజేను ఆపాలని సూచించారు. దీంతో డీజే ఆపించారని ఎస్‌ఐ కిరణ్‌పై యువకులు చేయి చేసుకున్నారు. సిబ్బంది వెంటనే వారిని చెదరగొట్టారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేయడంతో 10 మంది యువకులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల నుంచి కూడా సూచనలు వచ్చినట్లు సమాచారం.
Also Read: