Minor Girl Raped: పంజాబ్ బటిండాలో దారుణం వెలుగు చూసింది. కన్న తల్లే తన కూతురుపై అత్యాచారానికి ఉసిగొల్పింది. చివరికి తల్లి చేసే అరాచకం భరించలేక బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు ఆమె తల్లి సహా ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మైనర్ బాలిక(14) తల్లితో కలిసి బటిండాలోని సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటోంది. బాధితురాలు తల్లి తొమ్మిదేళ్ల క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి కూతరుతో కలిసి జీవనం సాగిస్తోంది. అయితే, డబ్బు సంపాదన కోసం ఆ తల్లి తన కూతురును వ్యభిచార రొంపిలోకి నెట్టేసింది.
తానే దగ్గరుండి తన కూతురుపై అత్యాచారం చేయించేది. తాజాగా జిరాక్ పూర్ హోటల్‌లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కూడా బాలిక తల్లి ప్రమేయంతో జరిగింది. తల్లి అరాచకాలను తట్టుకోలేకపోయిన బాలిక.. జిరాక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి సహా ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జిరాక్‌పూర్ హోటల్ నిర్వాహకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బాధిత బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Also read:
Nandamuri Balakrishna : లైగర్ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన లయన్.. నట సింహం ఎంట్రీతో సెట్‌లో సందడి..
Viral Photos: ప్రపంచంలో ఈ 5 అత్యంత విషపూరితమైన సాలెపురుగులు..!
Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి.. అదెక్కడుందో గుర్తించండి!