Mig-21 Fighter Aircraft Crashes: రాజస్థాన్‌లో కూలిన మిగ్‌-21 యుద్ధ విమానం.. పైలట్‌ సురక్షితం

|

Jan 06, 2021 | 1:04 AM

Mig-21 Fighter Aircraft Crashes:రాజస్థాన్‌లోని ఓ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బెస్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21...

Mig-21 Fighter Aircraft Crashes: రాజస్థాన్‌లో కూలిన మిగ్‌-21 యుద్ధ విమానం.. పైలట్‌ సురక్షితం
Follow us on

Mig-21 Fighter Aircraft Crashes:రాజస్థాన్‌లోని ఓ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బెస్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానం ల్యాండింగ్‌ సమయంలో తలెత్తిన సమస్య కారణంగా కూలిపోయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. ఎలాంటి ఆస్తినష్టం కూడా జరగనట్లు తెలుస్తోంది. విమానం ఒక్కసారిగా కూలడంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఎయిర్‌బెస్‌కు చేరుకున్నారు. సాంకేతిక లోపం వల్లే విమానం కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Also Read:

West Godavari District Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Boin‌pally Kidnapped: బోయిన్‌పల్లిలో మాజీ హాకీ ప్లేయర్‌ ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్‌