‘El Chapo’ Wife Arrested: ట్రంప్ పోరాటాన్ని కొనసాగిస్తున్న బైడెన్.. అంతర్జాతీయంగా డ్రగ్ మాఫియా డాన్ భార్య అరెస్ట్..

|

Feb 23, 2021 | 8:44 PM

Mexican drug lord: అమెరికాలో డ్రగ్స్ సరఫరాపై ట్రంప్ హయాంలో మొదలైన పోరాటాన్ని బైడెన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. మెక్సికోలోని సినోలా డ్రగ్ కింగ్‌పిన్‌ ఎల్‌ చాపో భార్య ఎమ్మా కరోనెల్..

‘El Chapo’ Wife Arrested: ట్రంప్ పోరాటాన్ని కొనసాగిస్తున్న బైడెన్.. అంతర్జాతీయంగా డ్రగ్ మాఫియా డాన్ భార్య అరెస్ట్..
‘El Chapo’ Wife Emma Coronel of arrested
Follow us on

‘El Chapo’ Wife Arrested: అమెరికాలో డ్రగ్స్ సరఫరాపై ట్రంప్ హయాంలో మొదలైన పోరాటాన్ని బైడెన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. మెక్సికోలోని సినోలా డ్రగ్ కింగ్‌పిన్‌ ఎల్‌ చాపో భార్య ఎమ్మా కరోనెల్‌ను అమెరికన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయంగా డ్రగ్ మాఫియాతో ఎమ్మాకు సంబంధాలున్నాయి.

ఎల్ చాపో జైలుకెళ్లిన తర్వాత ఎమ్మా అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మీదనే ఆమెను నార్త్ వర్జీనియాలోని డుల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో ఎల్‌ చాపోకు అమెరికన్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఎమ్మా అమెరికా వచ్చేవారు. అయితే ఇప్పుడు వాషింగ్డన్ ఎందుకు వచ్చారనేది అర్థం కాని అంశం. ఎల్ చాపో జైలు పాలైన తర్వాత కరోనెల్ అమెరికాలో డ్రగ్ రాకెట్‌ను నడిపిస్తోందనేది పోలీసుల ఆరోపణ. ఎమ్మా అరెస్ట్ విషయంలో స్పందించిన మెక్సికన్ అధికారులు, తాము ఎమ్మాను అరెస్ట్ చేయాలని కోరలేదని చెప్పారు.

ఆమెకు వ్యతిరేకంగా అమెరికన్ పోలీసుల వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో తమకు తెలియదని చెబుతున్నారు. ఎమ్మా అమెరికాలో హెరాయిన్, కొకైన్, మారిజువానా, మెథంపటమైన్ లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను అమెరికాలో సరఫరా చేస్తున్నారని వన్ కౌంట్ అభియోగాన్ని నమోదు చేశారు పోలీసులు. 2015లో ఎల్ చాపో మెక్సికన్ జైలు నుంచి తప్పించుకోవడం వెనుక ఎమ్మా హస్తం ఉంది. కరోనెల్‌కు అమెరికా, మెక్సికన్ పౌరసత్వం ఉంది.

18 ఏళ్ల వయసులో బ్యూటీ క్వీన్ గా ఎంపికైంది. జర్నలిజం చదావింది. 2007లో ఎల్ చాపో పెళ్లి చేసుకున్నాడు.వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎల్‌ చాపోకు లక్షకోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2009లో ఫోర్బ్స్ పత్రిక అతని ఆస్తులను 7 వేల కోట్ల రూపాయలుగా లెక్కకట్టింది. సినాలోవా ముఠా నుంచి యేటా అతనికి సుమారు 21 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్‌లో 25 శాతం చాపో ముఠా ద్వారానే జరుగుతుందని ఫోర్బ్స్‌ తెలిపింది. ఎల్‌ చాపో జైలు పాలైన తర్వతా ఈ వ్యాపార సామ్రాజ్యం అంతా ఎమ్మా కరోనెల్ కనుసన్నల్లోనే నడుస్తోంది.