బోయిన్‌పల్లిలో విషాదం… ఎమ్మెస్‌కి ప్రిపేర్ అవుతున్న మెడికో… అంతలోనే అనంతలోకాలకు పయనం..

ఉన్నత చదవులు చదవి ప్రయోజకులు అవుతారనుకుంటే చిరుప్రాయంలోనే ప్రాణాలను తీసుకుంటున్నారు. ఓ మెడికల్ విద్యార్థి జీవితం మీద విరక్తితో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బోయిన్‌పల్లిలో విషాదం... ఎమ్మెస్‌కి ప్రిపేర్ అవుతున్న మెడికో... అంతలోనే అనంతలోకాలకు పయనం..

Updated on: Feb 19, 2021 | 5:15 PM

Medical Student Suicide : ఉన్నత చదవులు చదవి ప్రయోజకులు అవుతారనుకుంటే చిరుప్రాయంలోనే ప్రాణాలను తీసుకుంటున్నారు. డాక్టర్ చదువులు చదవాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ అది అతి కొద్దిమందికే సాధ్యమవుతుంది. తీరా అంత చదువు చదివి బయటికొచ్చిన యువకుడికి కొలువు కరువవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. జీవితం మీద విరక్తితో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోయిన్‌పల్లి‌లోని సాయి రెసిడెన్సీలో నివాసముంటున్న శారన్.. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎమ్మెస్‌ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఎంబీబీఎస్ చదివినా చదువుకు తగ్గ ఉద్యోగం రావడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెట్టంత ఎదిగిన కొడుకు హఠాన్మరణంతో ఈ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Read Also…  చేసిన అప్పులు తీర్చలేక కన్నకూతుర్నే అమ్మేశాడు ఓ కసాయి తండ్రి.. ఏడాదిపాటు అమ్మాయిని బంధించి లైంగిక వేధింపులు..!