క్రైమ్‌ సీరియల్‌ చూసి తండ్రిని చంపిన మైనర్‌ బాలుడు

టీవీలో వచ్చే క్రైమ్‌ న్యూస్‌ పిల్లలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన రుజువు చేస్తోంది. క్రైమ్‌ పెట్రోల్‌ టీవీ సీరియల్‌లో కనీసం వందసార్లకు పైగా చూసిన ఆ బాలుడి మెదడు పూర్తిగా కలుషితం అయ్యింది..

క్రైమ్‌ సీరియల్‌ చూసి తండ్రిని చంపిన మైనర్‌ బాలుడు
Follow us
Balu

|

Updated on: Oct 29, 2020 | 4:32 PM

టీవీలో వచ్చే క్రైమ్‌ న్యూస్‌ పిల్లలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన రుజువు చేస్తోంది. క్రైమ్‌ పెట్రోల్‌ టీవీ సీరియల్‌లో కనీసం వందసార్లకు పైగా చూసిన ఆ బాలుడి మెదడు పూర్తిగా కలుషితం అయ్యింది.. లేకపోతే పట్టుమని పదిహేడేళ్లయినా లేవు.. అతడు తన తండ్రిని చంపేసి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తాడా? ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 42 ఏళ్ల మనోజ్‌ మిశ్రా ఇస్కాన్‌లో ఉంటూ విరాళాలు సేకరిస్తూ ఉండేవారు.. భగవద్గీతను చక్కగా బోధించేవారు.. మే నెల రెండున తన కొడుకు ఏం చేశాడో కానీ గట్టిగానే తిట్టారు.. 12వ తరగతి చదువుతున్న ఆ పిల్లోడికి కోపం వచ్చేసింది.. ఓ ఇనుపరాడ్‌తో తండ్రి తలపై కొట్టాడు.. ఆ దెబ్బకు తండ్రి కిందపడ్డారు.. అయినా ఆ పిల్లోడు కనికరం చూపలేదు.. తండ్రి గొంతును బట్టతో గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు.. చేసిన దారుణానికి కించిత్‌ పశ్చాత్తాపం కూడా లేకుండా తల్లి సంగీత మిశ్రా సాయంతో మృతదేహాన్ని అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలాంటి ప్రాంతానికి టూ వీలర్‌పై తీసుకెళ్లాడు.. అక్కడ పెట్రోల్‌, టాయిలెట్‌ క్లీనర్‌ను మిశ్రా శరీరంపై చల్లి కాల్చాడు.. మరుసటి రోజు పాక్షికంగా కాలిన స్థితిలో ఉన్న మృతదేహం పోలీసులకు కనిపించింది.. చుట్టుపక్కల పోలీసు స్టేషన్‌లలో ఏమైనా మిస్సింగ్‌ కేసులు ఉన్నాయేమో ఆరా తీశారు.. మూడు వారాలు గడిచినా మృతదేహం వివరాలు లభించలేదు.. ఇస్కాన్‌ వాళ్లేమో భగవద్గీత ప్రవచనాలను చెప్పడానికి వెళ్లి ఉంటారనుకున్నారు. 20 రోజులైనా మిశ్రా జాడ తెలియకపోవడంతో ఇస్కాన్‌వాళ్లకు అనుమానం వచ్చింది. మిశ్రా ఫ్యామిలీపై ఒత్తిడి తెచ్చారు.. దాంతో మనోజ్‌ మిశ్రా కుటుంబం మే 27 పోలీసు కంప్లయింట్‌ ఇచ్చింది.. ఆ తర్వాత పోలీసుల సూచన మేరు ఇస్కాన్‌ ఉద్యోగులు మృతదేహాన్ని చూశారు.. అక్కడున్న కళ్లజోడు ఆధారంగా అది మిశ్రా మృతదేహమేనన్న నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే మృతుడి కొడుకును విచారణకు ఎప్పుడు పిలిచినా ఏదో ఒక సాకు చెబుతుండేవాడు.. పోలీసులకు డౌట్‌ వచ్చి అతడి ఫోన్‌ను చెక్‌ చేశారు.. ఆ ఫోన్‌ హిస్టరీలో ఓ క్రైమ్‌ సీరియల్‌ను అదే పనిగా వందసార్లకు పైగా చూసినట్టు తేలింది.. దాంతో ఆ పిల్లోడిని తమ స్టయిల్‌లో ప్రశ్నించారు పోలీసులు.. దాంతో అతడు నేరం ఒప్పుకున్నాడు.. హత్య చేయడంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన అతడిపైనా, అతడికి సహకరించిన అతడి తల్లిపైనా పోలీసులు కేసు పెట్టారు..

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?