దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాల గూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు గురించి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన మారుతీరావు.. ఖైరతాబాద్‌లో బస చేశాడు. అయితే రాత్రి నుంచి ఫోన్ తీయకపోవడంతో.. మారుతీరావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వైశ్య భవన్‌కు చేరుకున్న పోలీసులు.. మారుతీరావు ఉన్న రూంను తెరలిచూడటంతో.. అతను రూంలో నిర్జీవంగా పడిపోయి కనిపించాడు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. కాగా.. మారుతీరావు సూసైడ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. లేఖలో కూతురు అమృతకు తల్లి దగ్గరికి వెళ్లిపో అంటూ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటంతో.. పోలీసులు ప్రణయ్ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.