Sharad Pawar: ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరాఠి నటి కేతకి చితాలేని పోలీసులు అరెస్ట్ చేశారు. శరద్ పవార్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు థానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆమెని కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె అరెస్టు నేపథ్యంలో కలాంబోలీ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై దాడి చేసేందుకు ఎన్సీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
‘పవార్’ అనే పేరును ప్రస్తావిస్తూ.. ‘నరకం వేచిచూస్తోంది, బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటారు’ అంటూ కేతకి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో పవార్ వయసును 80గా ప్రస్తావించారు. ఎన్సీపీ అధ్యక్షుడిని ఉద్దేశించే నటి ఈ పోస్టు పెట్టారంటూ స్వప్నిల్ నెట్కే అనే వ్యక్తి ఠాణెలోని కల్వా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్సీపీ కార్యకర్తలు సైతం ఆ నటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే కేతకి చితాలేను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్పీపీ కార్యకర్తలు ఆమెపై సిరా చల్లారు. కోడిగుడ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. కేత్కి చితాలే వివాదాల్లోకి రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై ఓ కామెడీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి