Maoist attack: గన్స్‌, ల్యాండ్ మైన్స్‌తో కాదు.. బాణం బాంబులతో దాడి.. మావోయిస్టుల దుశ్చర్య..

|

Mar 02, 2021 | 11:32 AM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొత్త తరహాలో దాడికి తెగబడడ్డారు. ఇప్పటి వరకు తుపాకులతో కాల్పులు జరపడం.., ల్యాండ్ మైన్స్ పేల్చి బీభత్సం

Maoist attack: గన్స్‌, ల్యాండ్ మైన్స్‌తో కాదు.. బాణం బాంబులతో దాడి.. మావోయిస్టుల దుశ్చర్య..
Maoist attack with arrow bombs in Chhattisgarh
Follow us on

Maoist attack With Arrow Bombs:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొత్త తరహాలో దాడికి తెగబడడ్డారు. ఇప్పటి వరకు తుపాకులతో కాల్పులు జరపడం.., ల్యాండ్ మైన్స్ పేల్చి బీభత్సం సృష్టించడం.. ఇదంత పాత పద్దతి అనుకున్నట్లున్నారు. ఇప్పుడు ఎదుటివారిపై దాడి చేసే స్టైల్ మార్చినట్లున్నారు.

మావోయిస్టులు అత్యాధునిక మారణాయుధాలను సమకూ ర్చుకుంటున్నారు. ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, యూబీజీ వంటి ఆయుధాలను వినియోగిస్తూ వస్తున్న మావోయిస్టులు ప్రస్తుతం సొంత సాంకేతికత పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయు ధాలను తయారు చేసుకుంటున్నట్లు తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

గతంలో వచ్చిన హాలీవుడ్‌ హిట్‌ సినిమా ‘రాంబో’లో నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ తనను పట్టుకునేందుకు వచ్చిన శత్రువులపై బాంబు బాణాలు, మోర్టార్లతో దాడి చేస్తాడు. అదే సీన్‌ను చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా డోర్నపాల్‌‌లో జరిగిన మెరుపుదాడిలో మావోయిస్టులు రిపీట్‌ చేశారు. రాంబో సినిమాలో మాదిరి గానే బాణాలకు ఐఈడీ బాంబులు కట్టి ప్రయోగించారు. రాజమండ్రి-జగదళ్‌పూర్‌ హైవేలో ఓ వాహనంపై బాణం బాంబ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

మావోయిస్టులకు సహకరిస్తున్న మిలీషియా సభ్యులు బాణాలను గురి తప్పకుండా సంధించడంలో  నిష్ణాతులని చెప్పవచ్చు. పోలీసులపై దాడి చేసేటప్పుడు కేవలం సాధారణ బాణాలే వినియోగించేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వారికి బాంబులతో కూడిన బాణాల వినియోగంపై పూర్తిస్థాయి తర్పీదు ఇచ్చినట్లు తెలిసింది. దీని కోసం మావోయిస్టులు అడవుల్లోనే కార్ఖానాలు ఏర్పాటు చేసి మోర్టార్లు, బాంబు బాణాలు తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దాడి ఎవరిమీదైతే దాడి చేసేవారిని ముందుగానే గుర్తించి ఎత్తయిన కొండలపై మాటువేస్తున్నారు. పోలీసులు ఆ ప్రదేశానికి రాగానే నలువైపుల నుంచి బాంబు బాణాలతో దాడి చేస్తున్నారు. తాజాగా సుక్మా జిల్లా డోర్నపాల్‌‌లో మావోయిస్టులు ఇదే వ్యూహాన్ని అమలు చేసినిట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

First Corona Case in Telangana: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు… తెలంగాణలో కరోనా మహమ్మారి జాడ ..
India vs England: బయో బబుల్ ఎఫెక్ట్.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్..