Suspected Death: భార్య ఉండగానే రెండో పెళ్లి.. కట్ చేస్తే భర్త అనుమానాస్పద మృతి.. సెల్ఫీ వీడియోలో అసలు నిజం..!

|

Jul 20, 2021 | 11:07 AM

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరి భార్యల మధ్య నలిగిన భర్త మరణించాడు. అయితే రెండో భార్య అతి కిరాతకంగా హతమార్చిందని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Suspected Death: భార్య ఉండగానే రెండో పెళ్లి.. కట్ చేస్తే భర్త అనుమానాస్పద మృతి.. సెల్ఫీ వీడియోలో అసలు నిజం..!
Man Suspected Death In Krishna District
Follow us on

Husband suspected death in Nandigama: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరి భార్యల మధ్య నలిగిన భర్త మరణించాడు. అయితే రెండో భార్య అతి కిరాతకంగా హతమార్చిందని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల రోజుల తర్వాత బయటపడ్డ సెల్ఫీ వీడియోతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మృతదేహన్ని మరోసారి బయటకు తీసిన పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేపట్టారు.

ఎనికేపాడు సమీపంలో జూన్ 18న వేదాద్రి అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు అతని మృతదేహన్ని స్వగ్రామం నందిగామకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఓ సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర మానసికక్షోభకు గురై వేదాద్రి చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భర్తను వదిలించుకునేందుకే హతమార్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచార చేపట్టారు. ఇన్నిరోజుల తర్వాత అతని వేదాద్రి మృతదేహాన్ని బయటకు తీసి రీపోస్ట్‌మార్టం నిర్వహించారు.

వాస్తవానికి వేదాద్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఉండగానే, నందిగామకు చెందిన ఓ యువతని రెండోపెళ్లి చేసుకుని ఎనికేపాడులో కాపురం పెట్టాడు. ఇంతలోనే ఏమైందో ఏమో వేదాద్రి జూన్ 18న అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. అయితే, అతని మరణం వెనుక రెండో భార్య కారణమై ఉంటుందని మొదటి బార్య ఫిర్యాదు చేసింది. అయితే, వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియోతో కేసు కొత్త మలుపు తిరిగుతోంది. వేదాద్రి రెండో భార్యను కూడా వదిలేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వేదాద్రి మరణానికి ముందు తాను వెళ్లిపోతున్నట్లు ఓ సెల్ఫీ తీసి రెండో భార్యకు పంపినట్లు తెలుస్తోంది. వదిలేసి వెళ్లినందుకే ఆమె భర్తను హతమార్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వేదాద్రి మృతదేహనికి రీపోస్టుమార్టం చేయించారు. అసలు వేదాద్రి మరణానికి గల కారణాలపై దర్యాప్తు వేగవంతం చేశారు.

Read Also…  Minor Arrest: పది కూడా పాస్ కాలేదు.. ఏకంగా ఫారిన్ నెంబర్లతో దడదలాడించేస్తాడు.. కన్నుపడిదంటే అంతే సంగతులు..