Black Magic: సంచలన ఘటన.. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మామను చంపిన అల్లుడు

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వరుసకు అల్లుడైన వ్యక్తే తన మామను అతి కిరాతకంగా హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని...

Black Magic: సంచలన ఘటన.. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మామను చంపిన అల్లుడు
Black Magic

Updated on: Sep 12, 2021 | 12:05 PM

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వరుసకు అల్లుడైన వ్యక్తే తన మామను అతి కిరాతకంగా హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేయించారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన విజయనగరం జిల్లాలో ఈ దారుణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో కేండ్రుక ఉత్తర(57) అనే వ్యక్తి.. పొలంలో పనులు చేస్తోన్న తన భార్య చిలకమ్మకు భోజనం అందించేందుకు వెళ్తున్నాడు. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన కొండతామర నారప్ప( ఉత్తరకు వరుసకు అల్లుడు) కేండ్రుగను వెంటాడాడు. ఉత్తర పారిపోగా..వెంబడించి గ్రామానికి దూరంగా ఉన్న ఓ జీడితోట వద్ద కర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఉత్తర చనిపోయాడు. మరోవైపు ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు.. రాత్రికి రాత్రే.. దహన సంస్కరణలు చేశారు. ఈ విషయం పోలీసులకు చెప్పేందుకు ప్రయత్నించిన‌ మృతుని తనయులను గ్రామ పెద్దలు నిలిపివేశారు.

అయితే తన తండ్రిని దారుణంగా హత్య చేయడాన్ని జీర్ణించుకోలేని ఉత్తర కుమారులు.. శనివారం ఉదయం పోలీసులకు కంప్లైంట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ షన్ముకరావు స్టాఫ్‌తో అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. డీఎస్పీ సుభాష్, సీఐ అప్పలనాయుడు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

Also Read: అతిపెద్ద సైన్యాన్ని కలిగిన 10 దేశాల జాబితా విడుదల.. భారత్ స్థానం ఎంతో తెలుసా?

సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని పిఠాపురంలో అభిమానుల పూజలు..