Murder: అమానుషం.. భార్యను గొడ్డలితో నరికి.. మృతదేహాన్ని వీధిలో ఈడ్చుకెళ్లిన భర్త.. కొడుకును కూడా..

Man kills son, wife: రాజస్థాన్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా తొమ్మిది నెలల శిశువును

Murder: అమానుషం.. భార్యను గొడ్డలితో నరికి.. మృతదేహాన్ని వీధిలో ఈడ్చుకెళ్లిన భర్త.. కొడుకును కూడా..
Man Kills Son, Wife

Updated on: Jun 02, 2021 | 3:11 PM

Man kills son, wife: రాజస్థాన్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా తొమ్మిది నెలల శిశువును కూడా పొట్టనబెట్టుకున్నాడు. భార్యను చంపిన అనంతరం ఆమె మృత దేహాన్ని వీధిలో ఈడ్చుకుంటూ వెళుతూ రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఇదంతా పట్టపగలు జనం తిరుగుతుండగా జరిగింది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిందంతా చెప్పి లొంగిపోయాడు. ఈ అమానుష సంఘటన రాజస్థాన్ కోటా జిల్లాలోని రాంపూర్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. రాంపూర్ భట్టపాడ ప్రాంతంలో నివసిస్తున్న పింటు అలియాస్ సునీల్ వాల్మీకి తన భార్య సీమా (35) మధ్య మంగళవారం ఏదో విషయంపై గొవడ జరిగింది.

అనంతరం భర్త వాల్మీకి భార్య సీమాపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా మృతదేహన్ని వీధిలో ఈడ్చుకెళ్లాడు. ఈ సంఘటన వారి కుమారుడు అవినాశ్ కూడా గాయపడగా.. అతను చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్, సర్కిల్ ఆఫీసర్ రామ్ కల్యాణ్ తెలిపారు. అనంతరం వాల్మీకి జరిగిన సంఘటన అంతా చెప్పి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ హత్య అనంతరం వాల్మీకి ప్రవర్తించిన తీరు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఈ ప్రాంతంలో తీవ్రం భయాందోళన నెలకొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలు హత్య చేయడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Bombay High Court: దేశానికి గొప్ప సేవ చేస్తున్నాడు.. ఆయనకు భద్రతపై భరోసా ఇవ్వండి – బాంబే హైకోర్టు

UP’s Gonda : సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం, ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

Follow Us