Man feeds Daughter Beer: పిల్లలను చూడగానే.. వారిపై ప్రేమతో ఏవైనా తినుబండారాలు కొని ఇవ్వాలనిపిస్తుంది. కానీ అలాంటి చిన్నారికి ఓ వ్యక్తి ఏకంగా బీరు తాపించాడు. ఈ సంఘటన కేరళ కాసర్‌గోడ్ జిల్లాలోని హోస్‌దుర్గ్‌లో చోటుచేసుకుంది. ఓ తండ్రి తన కూతురుపై ప్రేమతో ఏకంగా బీరు తాపించి జైలు పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోస్‌దుర్గ్‌లోని తోయమ్మాల్ గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ ఇంట్లో బీరు తాగుతూ తన ఎనిమిదేళ్ల కూతురుకు కూడా తాపించాడు. అయితే ఆ బాలిక కళ్లు తిరిగి పడిపోవడాన్ని చూసిన తల్లి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. వైద్యులు జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విసయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. బాలిక, తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
వాంగ్మూలం ఆధారంగా బాలిక తండ్రి రాధాకృష్ణన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి రెండు వారాల జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు అతడిని తీసుకెళ్లి జైల్లో వేశారు.
Also Read: