Viral video : కదిలే వాహనాలు, ట్రైన్లు ఎక్కొద్దంటూ ఎన్ని హెచ్చరికలు చేసిన.. కొందరు మాత్రం వాటిని భేఖాతరు చేస్తుంటారు. ఇక తాజాగా గోవాలో రైలు ఎక్కాలన్న తొందరల్లో.. ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కదిలే వాహనాలు ఎక్కడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కదిలే రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారిపడిన ఓ వ్యక్తి సురక్షితంగా బయటపడిన ఘటన గోవాలో జరిగింది. వాస్కో స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై ఓ ప్యాసింజర్ పరుగెత్తుకుంటూ వచ్చి వాస్కో- పాట్నా ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఎక్కే క్రమంలో కాలు స్లిప్ అవడంతో ట్రైన్, ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ట్రైన్‌ను అలాగే పట్టుకొని వెళ్తుండగా అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని బయటకు లాగాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను రైల్వే శాఖ ట్విటర్లో షేర్ చేయగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Monkey Stunts : అందుకేనేమో కోతిచేష్టలు అంటుంటారు.. ఈ కోతులు చేస్తున్న పని చూస్తే నవ్వాపుకోలేరు..