Man Dies After Thrashes Ties: రాను రాను మనుషుల్లో మానవత్వం మంటకలుస్తోంది. కనికరం లేకుండా కసాయిల్లా వ్యవహరిస్తున్నారు. ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ తతంగం బయటపడింది.
నీమచ్ జిల్లాలోని సింగోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ గ్రామానికి చెందిన కన్హయలాల్ భీల్(40) సింగోలీ- నీమచ్ ప్రధాన రహదారిపై గత గురువారం నిలుచుని ఉన్నాడు. ఛితర్ మాల్ గుర్జార్ అనే పాల వ్యాపారి ద్విచక్రవాహనంపై వచ్చి భీల్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. పాలు మొత్తం ఒలికిపోయాయి. పాలు నేలపాలయ్యాయనే కోపంతో భీల్‌పై గుర్జార్ దాడి చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులను పిలిచి.. తీవ్రంగా కొట్టించాడు. అందరు కలిసి భీల్ కాళ్లకు తాడుతో బంధించి.. ట్రక్కు వెనకాల కట్టేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించి స్థానికులు వీడియోలు చిత్రీకరించి.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని బంధ విముక్తి చేసింది ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే.. యువకుడిపై దాడికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు.. బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతూ భీల్ మృతి చెందాడు. ఈ దారుణానికి పాల్పడ్డ మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సూరజ్ కుమార్ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
Four persons have been arrested for allegedly beating a man, Kanhiya Bhil, tying his legs with a rope to a pick-up truck & then dragging him in Neemuch, Madhya Pradesh. A total of 8 persons have been booked in this matter: Sundar Singh Kanesh, Additional SP, Neemuch pic.twitter.com/DjGUoBExUQ
— ANI (@ANI) August 28, 2021