‘కరోనా’ టెస్ట్ చేయించుకోలేదని బంధువుల దాడి.. వ్యక్తి మృతి..!

కరోనా టెస్ట్ చేయించుకోలేదని 23 ఏళ్ల వ్యక్తిపై అతడి బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

కరోనా టెస్ట్ చేయించుకోలేదని బంధువుల దాడి.. వ్యక్తి మృతి..!

Updated on: May 24, 2020 | 3:01 PM

కరోనా టెస్ట్ చేయించుకోలేదని 23 ఏళ్ల వ్యక్తిపై అతడి బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిన్జోర్‌ జిల్లాలోని మలక్‌పూర్‌ గ్రామానికి చెందిన మన్జీత్ సింగ్ అనే వ్యక్తి ఈ నెల 19న ఢిల్లీ నుంచి తన స్వగ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో థర్మల్‌ స్క్రీనింగ్ చేయించుకోగా నెగిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అతడి శాంపిల్స్‌ను తీసుకోలేదు.

ఇంటికి వచ్చిన తరువాత మన్జీత్ సింగ్ బంధువులైన కపిల్, మనోజ్‌లు తరచుగా అక్కడికి వెళ్లి టెస్ట్ చేయించుకున్నావా..? అని అతడిని అడిగేవారు. ఇక ఈ విషయంలో గురువారం వారి మధ్య మాట మాట పెరిగింది. దీంతో కపిల్, మనోజ్‌, వారి తల్లి పునియా, మనోజ్‌ భార్య డాలీ అక్కడకు చేరుకొని మన్జీత్‌పై కర్రలతో దాడి చేశారు. ఆ ఘటనలో అతడి తల, భుజాలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మన్జీత్ స్పృహను కోల్పోగా.. వెంటనే తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మన్జీత్ కన్నుమూశాడు. దీనిపై కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సత్యప్రకాష్ అనే పోలీస్ తెలిపారు. తలకు తగిలిన గాయం వలన అతడు చనిపోవడంతో.. వైద్యులు శాంపిల్స్‌ని కలెక్ట్ చేయలేదని ఆయన అన్నారు.

Read This Story Also: ఏపీలో వాలంటీర్లపై వరుస దాడులు.. తాజాగా మరో రెండు చోట్ల..!

Loading...
Unable to load recommendations.
Follow Us