Chittoor District: కూతురు వరసయ్యే అమ్మాయిని ప్రేమించాడు.. పెద్దలు మందలించారు.. కట్ చేస్తే

చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుండ్లూరు పంచాయతీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.  కొర్ణమిట్టపల్లి గ్రామానికి చెందిన...

Chittoor District: కూతురు వరసయ్యే అమ్మాయిని ప్రేమించాడు.. పెద్దలు మందలించారు.. కట్ చేస్తే
Man Suicide

Updated on: Aug 09, 2021 | 3:18 PM

చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుండ్లూరు పంచాయతీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.  కొర్ణమిట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారుడు అశోక్ కుమార్ తిరుపతిలో ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అశోక్ తన పెద్దనాన్న మనవరాలు(వరుసకు కూతురు)అయిన అమ్మాయిని ప్రేమించాడు.  విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, పెద్దలు అతడిని మందలించారు.  దీంతో మనస్తాపం చెందాడు. తిరుపతికి వెళుతున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తర్వాత ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. చివరికి గ్రామ సమీపంలో అతడి డెడ్‌బాడీ కనిపించింది.  అశోక్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు  చేస్తున్నారు.

ఎట్టకేలకు అంతయ్య మృతదేహం లభ్యం

హైదరాబాద్‌ సిటీలోని సాహెబ్‌నగర్‌లో గల్లంతైన పారిశుద్ధ్య కార్మికుడు అంతయ్య డెడ్‌బాడీ లభ్యమైంది. డ్రైనేజీ పూడిక తీసేందుకు గత మంగళవారం రాత్రి శివ, అంతయ్య మ్యాన్‌హోల్‌లోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో 800ఎంఎం సివర్‌ ట్రంక్ పైపు లైన్‌లో అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు. డ్రైనేజీలో పడిన ఇద్దరిలో శివ డెడ్‌బాడీ ఇప్పటికే లభ్యమైంది. కోయంబత్తూర్‌ టెక్నాలజీ సాయంతో ఓ కెమెరాను సివర్‌ ట్రంక్‌ పైపులోకి పంపి మృతదేహాన్ని సామానగర్‌ వద్ద గుర్తించారు. అక్కడికి చేరుకున్న అతడి కుటుంబ సభ్యులు మృతదేహం అంతయ్యదే అని నిర్ధరించారు. కార్మికుడి ఆచూకీ కోసం అధికారులు డ్రోన్‌ కెమెరాలు, 300 మంది పురపాలక సిబ్బంది, 4 రెస్క్యూ టీంలు, ఎండమాలజీ, ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ను ఉపయోగించారు.

Also Read:మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టుకు ఊర్మిళ గజపతి రాజు

Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

Loading...
Unable to load recommendations.
Follow Us