ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఎవరూ చేయని పనిచేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ ఆటో యజమాని వినూత్నంగా నిరసన తెలిపాడు. పోలీస్ స్టేషన్ ఎదుటే ఆటోకు నిప్పు పెట్టి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో శుక్రవారం జరిగింది.
ప్రవీణ్ అనే వ్యక్తి పొట్ట కూటి కోసం పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆటో కొనుగోలు కోసం ఫైనాన్షియర్ల వద్ద డబ్బులు తీసుకున్నట్టు తెలిపాడు. అయితే కరోనా నేపథ్యంలో ఆటో సరిగా నడపక, ఫైనాన్స్ కట్టడం ఆలస్యమైంది. దీంతో ప్రవీణ్‌పై ఫైనాన్స్ సిబ్బంది ఒత్తిడి ఎక్కువైంది. కిస్తీ కట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవటంతో..వారి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లాక్‌డౌన్ వల్ల అంతా ఇంట్లోనే ఉండిపోవడంతో ఇల్లు గడవడం కష్టమైందని విన్నవించుకున్నాడు. ఫిర్యాదు తర్వాత వారి వేధింపులు మరింత పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ తన ఆటోను తానే పెట్రోల్ పోసి తగులబెట్టుకున్నాడు.
పరకాల పోలీస్ స్టేషన్ ఎదుట తన ఆటోకు నిప్పుపెట్టి దగ్ధం చేసి నిరసన తెలిపాడు. అప్పిచ్చిన ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక, ఏం చేయాలో తోచక ఈ పని చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also Read :
తపశ్శక్తి పేరుతో నిలువు దోపిడీ.. అన్నదమ్ములను అడ్డంగా ముంచిన దొంగ స్వామీజీలు.. తస్మాత్ జాగ్రత్త!