ప్రధానిపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు… అరెస్ట్ చేసిన పోలీసులు..!

| Edited By:

Apr 04, 2020 | 7:48 PM

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశం అంతా సంక్షోభంలో ఉంటే.. కొందరు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియా వేదికగా రాజకీయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అసోంలో ఓ వ్యక్తి ఏకంగా ప్రధాని మోదీపైనే ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై అన్ని వర్గాల ప్రజా సంఘాల నుంచి.. స్థానిక నేతలతో పాటు.. నెటిజన్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ వ్యవహారం ఏకంగా కచర్ జిల్లా ఎస్పీ […]

ప్రధానిపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు... అరెస్ట్ చేసిన పోలీసులు..!
Follow us on

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశం అంతా సంక్షోభంలో ఉంటే.. కొందరు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియా వేదికగా రాజకీయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అసోంలో ఓ వ్యక్తి ఏకంగా ప్రధాని మోదీపైనే ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై అన్ని వర్గాల ప్రజా సంఘాల నుంచి.. స్థానిక నేతలతో పాటు.. నెటిజన్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ వ్యవహారం ఏకంగా కచర్ జిల్లా ఎస్పీ వరకు చేరింది. దీంతో సదరు పోస్ట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వ్యక్తిని పట్టుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.