Man Arrested: హైదరాబాద్ నగరంలోని ఓ మాజీ డీజీపీ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి నుంచి ఓ దొంగ బోన్సాయ్ ప్లాంట్‌ను ఎత్తుకెళ్లాడు. పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని ఓ మాజీ డీజీపీ ఇంట్లో బోన్సాయ్ కనిపించడం లేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ప్రసన్నాంజనేయులు, అతడి సహచరుడు అభిషేక్ మాజీ డీజీపీ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ రికార్డ్ అయింది. అంతేకాకుండా ఇంటి నుంచి బోన్సాయ్ ప్లాంట్‌ను దొంగిలించినట్లు స్పష్టంగా తెలిసింది. అయితే పోలీసులు యూసఫ్‌గూడలోని ప్రసన్నాంజనేయులు ఇంట్లో ఉన్నట్లు ట్రాక్ చేసి వెళ్లి అరెస్ట్ చేశారు. దొంగిలించిన బోన్స్‌య్‌ను అతని దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతనికి సహకరించిన అభిషేక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.