Gurgaon Crime News : వాటాల మధ్య తేడాలు.. పాట్నరే కిడ్నాప్ చేసి చితక్కొట్టాడు.. ఈ గ్రూప్‌లో ఓ మహిళ కూడా..

Gurgaon Crime News : ఆ ఇద్దరు మంచి స్నేహితులు.. కలిసి పనిచేద్దామని నిర్ణయించుకొని బిజినెస్ ప్రారంభించారు. కానీ వాటాల మధ్య తేడాలు

Gurgaon Crime News : వాటాల మధ్య తేడాలు.. పాట్నరే కిడ్నాప్ చేసి చితక్కొట్టాడు.. ఈ గ్రూప్‌లో ఓ మహిళ కూడా..
Gurgaon Crime News

Updated on: Mar 16, 2021 | 9:48 PM

Gurgaon Crime News : ఆ ఇద్దరు మంచి స్నేహితులు.. కలిసి పనిచేద్దామని నిర్ణయించుకొని బిజినెస్ ప్రారంభించారు. కానీ వాటాల మధ్య తేడాలు రావడంతో ఒకరికొకరు బద్ధ శత్రువులుగా మారిపోయారు. కనిపిస్తే చంపుకునేంతలా ఇద్దరి మధ్య ద్వేషం పెరిగింది. గురుగ్రాంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గురుగ్రాంకి చెందిన రోషన్‌, సందీప్‌ అనే ఇద్దరు యువకులు పెయింటింగ్‌ బిజినెస్‌ ప్రారంభించారు. అపార్టుమెంట్లు, ఇండ్లకు రంగులు వేయించే కాంట్రాక్టులు చేపట్టి డబ్బు సంపాదించారు. వచ్చిన వాటిని వాటాల పేరుతో పంచుకునేవారు. అయితే ఇద్దరి మధ్య తేడా రావడంతో విభేదాలు తలెత్తాయి. ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా రోషన్‌ కోరడంతో సందీప్‌ అందుకు నిరాకరించాడు.

అంతేగాక తన స్నేహితులు అంకుఖ్‌, ఖాజన్‌ సింగ్‌తో కలిసి రోషన్‌ను పలం విహార్‌లో గల తమ ఫ్లాట్‌కు తీసుకువచ్చాడు. వీరితో పాటు మరో మహిళ కూడా జతకలిసింది. అంతా కలిసి రోషన్‌ను తీవ్రంగా కొట్టారు. రాడ్డుతో కొడుతూ.. చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాకుండా కొట్టుకుంటూ వీడియో తీస్తూ రాక్షస ఆనందం పొందారు. వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. వారి చెరనుంచి ఎలాగోలా తప్పించుకున్న రోషన్ ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోషన్ స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

India vs England 3rd T20 Live: మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. తక్కువ పరుగులకే రాయ్ అవుట్..

ప్రేమంటే ఇదేరా..! తాతకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్న మనవడు.. ఎక్కడో తెలుసా..

Tanushree Dutta : 18 నెలల్లో 18 కిలోలు తగ్గిన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ.. అంతలా ఎందుకు కష్టపడిందో తెలిస్తే షాక్..