శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

|

Jun 05, 2020 | 5:25 PM

శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పోగ, మంటలు వ్యాపించటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
Follow us on

హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లా బిడ్ది ప్రాంతంలో శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నుంచి శుక్రవారం ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ, మంటలు వ్యాపించటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు హడలెత్తిపోయారు. ఫ్యాక్టరీలో నుంచి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. శానిటైజర్లు తయారీకి ఉపయోగించే పదార్థాల వల్లే ఫ్యాక్టరీలో ఈ మంటలంటుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, జరిగిన ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.