Accident: చౌటుప్పల్‌లో దారుణం.. పల్సర్‌ బైక్‌ను ఢీకొట్టిన లారీ.. అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన ముగ్గురు యువకులు.

|

Aug 28, 2021 | 10:03 AM

Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతోన్న పల్సర్‌ బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో...

Accident: చౌటుప్పల్‌లో దారుణం.. పల్సర్‌ బైక్‌ను ఢీకొట్టిన లారీ.. అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన ముగ్గురు యువకులు.
Accident Bike
Follow us on

Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతోన్న పల్సర్‌ బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో మృతి చెందిన వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ చిల్ల చిట్యాల మండలంలోని పిట్టంపల్లికి చెందిన హరీశ్‌తో పాటు మరో ఇద్దరు యువకులు హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. హరీశ్‌ స్వగ్రామంలో వివాహం ఉండడంతో వీరు ముగ్గురు బైక్‌పై వచ్చారు. వివాహం పూర్తి అయిన తర్వాత శనివారం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో పిట్టంపల్లి నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు.
ఈ క్రమంలోనే వీరు ముగ్గురు ధర్మోజీగూడెం చేరుకునే సరికి.. అక్కడ ఉన్న ఓ వేబ్రిడ్జి వద్ద రివర్స్‌ గేర్‌లో వస్తోన్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ ఒక్కసారిగా కిందపడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ముగ్గురు యువకులు అప్పటికే మరణించారు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Also Read: Organic Farming: ఆర్గానిక్ వ్యసాయంపై దృష్టి పెడుతున్న మహిళలు.. స్థలం అద్దెకు తీసుకుని మరీ కూరగాయలు పండిస్తున్న వైనం

500 ఏనుగులతో ఆఫ్ఘనిస్తాన్‌ని గెలిచిన భారత రాజు..! అప్పటి నుంచే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు

భారత తీర గస్తీదళం అమ్ముల పొదిలో మరో నౌక.. విశాఖ కేంద్రంగా విధులు.. స్పెషాలిటీస్ ఇవే