Maharashtra: ఆక్రమణలను అడ్డుకున్న అధికారిపై దాష్టీకం.. మందలించిన పాపానికి మునివేళ్లనే నరికేశారు..

ఆక్రమణలను అడ్డుకున్నందుకు దుండగులు బరితెగించారు. వద్దని వారించిన అధికారులపై దౌర్జన్యం చేశారు. వ్యాపారులను ఖాళీ చేయించడానికి వచ్చిన ఓ మహిళా అధికారి చేతి వేళ్లను నరికేశారు.

Maharashtra: ఆక్రమణలను అడ్డుకున్న అధికారిపై దాష్టీకం.. మందలించిన పాపానికి మునివేళ్లనే నరికేశారు..
Civic Official Loses 3 Fingers After Angry Hacker Attacks

Updated on: Sep 01, 2021 | 8:35 AM

Hacker attacks on ACP: ఆక్రమణలను అడ్డుకున్నందుకు దుండగులు బరితెగించారు. వద్దని వారించిన అధికారులపై దౌర్జన్యం చేశారు. వ్యాపారులను ఖాళీ చేయించడానికి వచ్చిన ఓ మహిళా అధికారి చేతి వేళ్లను నరికేశారు. మహారాష్ట్రలోని థానేలో చిరు వ్యాపారులు బీభత్సం సృష్టించారు. అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని.. ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అసిస్టెంట్​ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్​చేతి మూడు వేళ్లు తెగిపడిపోయాయి.

మహారాష్ట్రలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా దుకాణాలు ఏర్పరుచుకున్న వీధి వ్యాపారులపై థానే మున్సిపల్​ కార్పొరేషన్​చర్యలు చేపట్టింది. మున్సిపల్​ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్​బందర్​రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి పోలీసుల సహాయంతో మున్నిపల్ అధికారులు అక్కడికి చేరుకోగా, ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఏసీపీ కల్పితా పింపుల్‌పై కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్ మూడు వేళ్లు తెగిపడ్డాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. ఇది గమనించిన అధికారులు హుటాహుటీన ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్​ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో ఏసీపీతోపాటు ఉన్న సెక్యూరీటీ గార్డు, పలువురు ఇతర సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దాడి కేసులో నిందితుడు అమర్జీత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసుతో సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్​ వినయ్​ రాఠోడ్​ పేర్కొన్నారు.

Read Also… Road on High Altitude: రికార్డు సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారిని నిర్మించిన భారత్ ఆర్మీ.. ఎక్కడంటే..

Soldiers Nicole Gee: చిన్నారిని లాలించిన సైనికురాలు ఇక లేరు.. కాబూల్‌ బాంబు పేలుళ్లలో గాయపడి దుర్మరణం