మృత్యుబావి: నీళ్ల కోసం వెళ్తే నలుగురిని మింగేసింది

|

Jul 02, 2020 | 4:19 PM

అసలే కరోనా కష్టకాలం. మరోవైపు ప్రకృతి విపత్తులు, ఇంకోవైపు ప్రజల జీవన పోరాటంలో రోజుకో గండాలను దాటుకుంటూ మహారాష్ట్రలో పేదలు, కూలీలు పడుతున్న కష్టాలు మాటల్లో చెప్పలేనివి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో..

మృత్యుబావి: నీళ్ల కోసం వెళ్తే నలుగురిని మింగేసింది
Follow us on

అసలే కరోనా కష్టకాలం. మరోవైపు ప్రకృతి విపత్తులు, ఇంకోవైపు ప్రజల జీవన పోరాటంలో రోజుకో గండాలను దాటుకుంటూ మహారాష్ట్రలో పేదలు, కూలీలు పడుతున్న కష్టాలు మాటల్లో చెప్పలేనివి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మహారాష్ట్రలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నీళ్ల కోసం వెళ్లిన నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. దీంతో మ‌ృతుల కుటుంబాలను తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని గోండియా జిల్లా పంగావ్‌లో నీళ్లు తెచ్చేందుకు ఓ యువకుడు బావిలోకి దిగారు. అయితే, ఆ బావి చాలా లోతుగా ఉండటంతో ఊపిరాడక స్పృహా తప్పిపడిపోయాడు. అందులోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని తెచ్చేందుకు మరో ముగ్గురు బావిలోకి దిగగా.. వాళ్లు సైతం ఊపిరాడక అందులోనే పడి చనిపోయారు. దీంతో బాధిత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి గ్రామంలోనూ ఎటు చూసినా విషాదమే అవహించింది.