యువతిని అపహరించిన నలుగురు దుండగులు.. మద్యం తాగించి రెండు రోజులపాటు అఘాయిత్యం..!

|

Feb 22, 2021 | 7:29 AM

ప్రభుత్వ చట్టాలు తుత్తునియలవుతున్నాయి. మానవ మృగాలు మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పార్టీ కార్యకర్తతో సహా నలుగురు కామాంధులు రెచ్చిపోయారు.

యువతిని అపహరించిన నలుగురు దుండగులు.. మద్యం తాగించి రెండు రోజులపాటు అఘాయిత్యం..!
Follow us on

Woman Gang Raped : ప్రభుత్వ చట్టాలు తుత్తునియలవుతున్నాయి. మానవ మృగాలు మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పార్టీ కార్యకర్తతో సహా నలుగురు కామాంధులు రెచ్చిపోయారు. ఓ యువతిని రెండు రోజులపాటు బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని శందోల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

జైత్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గడాఘాట్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. స్థానిక నేతతో పాటు నలుగురు వ్యక్తులు 20 ఏళ్ల యువతికి మద్యం తాగించి, రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. యువతిని కిడ్నాప్ చేసిస దుండగులు ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు అతి దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈనెల 18న యువతిని అపహరించుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చి బలవంతంగా మద్యం తాగించారు. రాక్షసకాండ పూర్తయ్యాక ఈ నెల 20న ఆమె ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణానికి పాల్పడ్డ నలుగురిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నలుగురు నిందితుల్లో ఒకరు స్థానిక బీజేపీ నాయకుడు విజయ్‌ త్రిపాఠీ అని పోలీసులు తెలిపారు. మరోవైపు, అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా పార్టీ నేతలు ప్రకటించారు. కాగా, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు.

Read Also…  బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడి ఇంట తీవ్ర విషాదం.. నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య..!