Crime News: ప్రేమజంట బలవన్మరణం.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని కారు అద్దెకు తీసుకుని..

పెళ్లి చేసుకుంటామని ఇళ్లల్లో చెప్పారు. అయితే, వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిద్దరూ మనస్తాపానికి గురయ్యారు.

Crime News: ప్రేమజంట బలవన్మరణం.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని కారు అద్దెకు తీసుకుని..
Lovers Suicide

Updated on: May 23, 2022 | 9:09 AM

Lovers Committed suicide: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు.. కానీ పెద్దలు వారి ప్రేమను వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రేమ జంట దారుణ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. తాము ప్రయాణిస్తున్న కారుకు నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై కారులోనే పెట్రోల్‌ పోసుకుని సజీవదహనమయ్యారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగింది. బెంగళూరు పట్టణానికి చెందిన యశ్వంత్ (23), జ్యోతి (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇళ్లల్లో చెప్పారు. అయితే, వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిద్దరూ మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరూ మంగళూరు చేరుకొని మట్లాడుకున్నారు. అనంతరం అక్కడ ఓ కారును అద్దెకు తీసుకుని ఉడుపి వైపు బయలుదేరారు. అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన వారు తాము చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యేలోపే ప్రాణాలు తీసుకున్నారు.

ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కారుకు నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉడుపి జిల్లా బహ్మార్వ తాలూకా హెగ్గుంజె సమీపంలో కారుపై పెట్రోలు పోసి లోపల కూర్చుని నిప్పంటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే లోపలున్న యశ్వంత్-జ్యోతి అగ్నికి ఆహుతయ్యారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..