Crime: వీళ్లేం తల్లీదండ్రులు.. విషం పెట్టి మరీ కన్నబిడ్డ ప్రాణం తీశారు.. కోర్టు ఏం శిక్ష విధించిందంటే..?

|

Feb 12, 2021 | 7:24 PM

మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో తల్లిదండ్రులు విష ప్రయోగం చేసి పండంటి బిడ్డను చంపేశారు. కేసును విచారించిన  నల్గొండ జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి..

Crime: వీళ్లేం తల్లీదండ్రులు.. విషం పెట్టి మరీ కన్నబిడ్డ ప్రాణం తీశారు.. కోర్టు ఏం శిక్ష విధించిందంటే..?
Follow us on

మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో తల్లిదండ్రులు విష ప్రయోగం చేసి పండంటి బిడ్డను చంపేశారు. కేసును విచారించిన  నల్గొండ జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేష్ చలించిపోయారు. నిందితులకు‌ గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

వివరాల్లోకి వెళ్తే..  నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పడమటి తండాకు చెందిన రమావత్‌ జయరాం, నాగమణి దంపతులు కూలీలు. వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. రెండో కాన్పులోనూ అమ్మాయి పుట్టి, పురిట్లోనే తనువు చాలించింది. నాగమణి 2016లో మరోసారి గర్భం దాల్చగా, అదే ఏడాది డిసెంబరులో మళ్లీ పాపే పుట్టింది. పాపను పెంచలేమని… బిడ్డ ఆరోగ్యం, ఆలనాపాలనాపై తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని స్థానిక అంగన్‌వాడీ టీచర్‌ కొండమ్మ ఉన్నతాధికారులకు తెలియజేశారు. 2017 జనవరిలో అప్పటి దేవరకొండ క్లస్టర్‌ సీడీపీవో భూక్యా సక్కుభాయ్‌ తండాకు చేరుకుని, చిన్నారిని నల్గొండ శిశు గృహానికి తరలించారు.

జనవరి చివరి వారంలో జయరాం, నాగమణి దంపతులు శిశు గృహానికి వెళ్లి, పాపను పెంచుకుంటామంటూ తమతో పాటే ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న చిన్నారి అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి అంత్యక్రియలు చేయబోయారు. దీనిపై ఐసీడీఎస్‌ అధికారుల కంప్లైంట్‌తో పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. విషప్రయోగం వల్లే పాప మరణించిందని పోస్టుమార్టంలో నిర్ధారణ అయ్యింది. పాలల్లో గుళికలు కలిపి తాగించడంతో పాప చనిపోయిందని తల్లిదండ్రులు అంగీకరించారు. నేరం రుజువు అవ్వడంతో వారికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు న్యాయమూర్తి.

Also Read:

Student suicide: “అమ్మ లేకుండా నేనెలా బ్రతకగలను”..! క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య..

FASTag : ఫాస్టాగ్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. పనిలో పనిగా దాన్ని ఎలా కొనుగోలు చేయాలో వివరాలు మీ కోసం