Devineni Uma: దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదు.. హైడ్రామా ఆపై ట్విస్ట్..

|

Jul 28, 2021 | 10:10 AM

టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు...

Devineni Uma: దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదు.. హైడ్రామా ఆపై ట్విస్ట్..
Devineni Uma
Follow us on

టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన  దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ సమయంలో ఏ కేసులు పెడుతున్నారనేది చెప్పని పోలీసు అధికారులు.. కాసేపటి క్రితం వెల్లడించారు. దేవినేనిపై మొత్తం రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు.

అర్ధరాత్రి ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

మంగళవారం హైడ్రామా..

కృష్ణా జిల్లా మైలవరం నియోజక వర్గంలో మైనింగ్ వివాదం రచ్చ రాజేసింది. రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి కాస్తా.. ప్రత్యక్ష దాడి వరకు వెళ్లింది. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన కారుపై దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో మైనింగ్‌ను పరిశీలించి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు. ఉమ కారుపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులపనే అని దేవినేని అరోపించారు.

అర్ధరాత్రి దేవినేని ఉమాను జి.కొండూరు అరెస్టు చేశారు.  దేవినేనిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో హైడ్రామా నడిచింది. స్టేషన్‌ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో దేవినేని ఉమాను తీసుకొస్తున్న పోలీసులు అక్కడికి అర కిలోమీటరు దూరంలోనే వాహనాన్ని నిలిపివేశారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి ఉమా అక్కడే కారులో ఆగిపోయారు. తాను ఫిర్యాదు ఇస్తానని, తీసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు తీసుకునే దాకా తాను కదిలేది లేదని ఆయన భీష్మించుకుని అందులోనే కూర్చున్నారు. కారును తొలగించి, ఉమాను తరలించేందుకు పోలీసులు పెద్ద క్రేన్‌ను కూడా తెప్పించారు.

ఇది కూడా చదవండి: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు

ఇది కూడా చదవండి: Karnataka New CM: కర్నాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై.. ఇవాళ ప్రమాణస్వీకారం..