Andhra Pradesh: వారి బలహీనతను బలంగా మార్చుకుని.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని.. కట్ చేస్తే

|

Aug 04, 2022 | 10:27 AM

కృష్ణా జిల్లాలోని (Krishna district) కంకిపాడుకు చెందిన ఇద్దరు బాలికలకు యాక్టింగ్ అనే ఇష్టం. ఒకరు టిక్ టాక్ వీడియోలు చేస్తుండగా.. మరొక బాలిక ఇటీవలే ఆడిషన్స్ కు వెళ్లింది. కొన్ని కారణాలతో హైదరాబాద్ నుంచి తిరిగి...

Andhra Pradesh: వారి బలహీనతను బలంగా మార్చుకుని.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని.. కట్ చేస్తే
Kankipadu Crime
Follow us on

కృష్ణా జిల్లాలోని (Krishna district) కంకిపాడుకు చెందిన ఇద్దరు బాలికలకు యాక్టింగ్ అనే ఇష్టం. ఒకరు టిక్ టాక్ వీడియోలు చేస్తుండగా.. మరొక బాలిక ఇటీవలే ఆడిషన్స్ కు వెళ్లింది. కొన్ని కారణాలతో హైదరాబాద్ నుంచి తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. వీరి ఆసక్తిని గమనించిన జోజి అనే వ్యక్తి.. మాయమాటలు చెప్పి వీరిద్దరిని తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలికలను తీసుకెళ్లేముందు (Kidnap) నిందితుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. నిందితుడి భార్య ప్రసవం కోసం వెళ్లిన సమయంలో బాలికలను తనతోపాటు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. జోజి తన వెంట రూ.20 వేలు డబ్బు తీసుకెళ్లాడు. అయితే తమ కుమార్తెల అదృశ్యంపై తల్లిదండ్రులు భాయందోళనకు గురవుతున్నారు. వారికి జోజితో కనీసం పరిచయం కూడా లేదని, ఒకవేళ ముందే తెలిస్తే స్కూల్ యూనిఫాం మార్చుకుని, డబ్బు, నగలు తీసుకుని వెళ్లేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు. నటనపై వారికున్న బలహీనతను వాడుకుని వారిని ప్రేరేపించి బలవంతంగా ఎక్కడికో తీసుకువెళ్లి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. బాలికలు స్కూల్ నుంచి వెళ్లే సమయంలో డబ్బుల కోసం తమ పుస్తకాలు పాత ఇనుమ సామాన్ల షాపులో అమ్మేయడం గమనార్హం.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బృందాలుగా విడిపోయి నిందితుడు, బాలికల కోసం గాలిస్తున్నారు. జోజి ఇంటికి తాళం వేసి ఉండటం మరిన్ని అనుమానాలు కలిగిస్తుంది. బాలికలను తనతో పాటు తీసుకుని వెళ్లేంత వరకు ఎవరెవరితో మాట్లాడాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు బైక్ పై తీసుకెళ్లి.. అక్కడ రైలు ఎక్కినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ఆ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే విజయవాడ నుంచి వెళ్లిన ముగ్గురు ఎక్కడ దిగారు? అక్కడి నుంచి ఎటు వెళ్లారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. చెన్నై, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి