CM BS Yediyurappa: కర్ణాటక సీఎం యడియూరప్ప అభిమాని ఆత్మహత్య.. రాజీనామా జీర్ణించుకోలేక దారుణం..!

|

Jul 27, 2021 | 3:34 PM

యడియూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని జీర్ణించుకోలేక అతడు ప్రాణం తీసుకున్నాడని కుటుంబసభ్యలు తెలిపారు.

CM BS Yediyurappa: కర్ణాటక సీఎం యడియూరప్ప అభిమాని ఆత్మహత్య.. రాజీనామా జీర్ణించుకోలేక దారుణం..!
.jpg
Follow us on

Karnataka CM BS Yediyurappa fan commit suicide: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వీరాభిమాని ఆత్మహత్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. యడియూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని జీర్ణించుకోలేక అతడు ప్రాణం తీసుకున్నాడని కుటుంబసభ్యలు తెలిపారు. ఈ విశాద ఘటన కర్ణాటకలోని గుండ్లుపేట్ తాలూకా బొమ్మలపురా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మలపురా గ్రామానికి చెందిన యువకుడు రవి (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా యడియూరప్ప తన ట్విటర్‌లో తెలిపారు. రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత జూలై 26న కర్ణాటక సీఎం యడియూరప్ప తన సీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్తవారికి అవకాశం కల్పించేందుకు తాను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. తన మీద ఎవరి ఒత్తిడి లేదని చెబుతూ కన్నీటి పర్యంతంమయ్యారు. అయితే, బీజేపీ హైకమాండ్ ఒత్తిడి వల్ల రాజీనామా చేశారని అందరూ భావిస్తున్నారు. యడియూరప్ప సీఎం పదవి నుంచి వైదొలగడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదిలావుంటే, తన పదవికి రాజీనామా చేసిన వెంటనే గవర్నర్ కూడా దాన్ని ఆమోదించారు. కొత్త సీఎం వచ్చే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. యడియూరప్ప అందుకు అంగీకరించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్న సమయంలో యడియూరప్ప అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. ఎవరూ ఆందోళనలు చేయవద్దని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. అయినా కొన్నిచోట్ల యడియూరప్ప అభిమానులు కొంత ఆందోళనలు చేశారు. కొన్నిచోట్ల స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే, రవి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని యడియూరప్ప ట్విటర్ ద్వారా తెలియజేశారు.

‘నా రాజీనామా విషయం తట్టుకోలేక గుండ్లపేటకు చెందిన రాజప్ప (రవి) ఆత్మహత్య చేసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ సమయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ కష్ట సమయంలో రవి కుటుంబానికి అండగా ఉంటా.’ అంటూ యడియూరప్ప ట్వీట్ చేశారు.


అయితే, ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా యడియూరప్ప రాజీనామాకు సిద్ధం కావడంతో మరోవైపు బీజేపీ పెద్దలు ఆయన వారసుడి వేటలో మునిగారు. కొత్త సీఎం ఎంపికపై ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కర్ణాటక ఇన్‌చార్జి అరున్ సింగ్, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధులు కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్‌, జి.కిషన్‌రెడ్డి ఈ రోజు బెంగళూరు చేరుకుని కొత్త సీఎం పేరును ప్రకటించనున్నారు.

Read Also….  MLA dumps: వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం చూసిన ఎమ్మెల్యే.. అధికారుల తీరుపై ఆగ్రహించి ఏంచేశాడంటే..?