Karnataka Crime: కర్ణాటకలో నడిరోడ్డుపై దారుణం.. బజరంగ్ దళ్ కార్యకర్తను హతమార్చిన దుండగులు

|

Feb 21, 2022 | 6:41 AM

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ యువకుడిని అర్థరాత్రి అతి దారుణంగా హతమార్చారు. షిమోగా జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తను గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు.

Karnataka Crime: కర్ణాటకలో నడిరోడ్డుపై దారుణం.. బజరంగ్ దళ్ కార్యకర్తను హతమార్చిన దుండగులు
Crime
Follow us on

Karnataka Young Man Murdered: కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ యువకుడిని అర్థరాత్రి అతి దారుణంగా హతమార్చారు. షిమోగా జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తను గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ హత్య తర్వాత షిమోగా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడిని బజరంగ్ దళ్ కార్యకర్త అయిన హర్ష్‌ అల్డోగా పోలీసులు గుర్తించారు. హర్ష్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడనే నెపంతో ఈ హత్య జరిగినట్లు బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

24 ఏళ్ల హర్ష రాత్రి 9 గంటల సమయంలో దారుణంగా హత్యకు గురయ్యాడు. హర్ష ఆల్డో భజరంగ దళ్ కార్యకర్త. అక్కడ నలుగురు దుండగులు మారణాయుధాలతో కారులో దూసుకెళ్లి హర్షను హత్య చేసి తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన శివమొగ్గ నగరంలోని భారతి కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. దొడ్డపేట పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది, డీసీ, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న హర్ష్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.

హత్య అనంతరం శివమొగ్గ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి ప్రయత్నించగా, గుంపును అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపు చేసేందుకు శివమొగ్గ డీసీ.. నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మృతుడి మృతదేహాన్ని శివమొగ్గలోని మెక్‌గన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల నుంచి హర్ష దుండగులకు టార్గెట్‌గా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Read Also… CM KCR: నేడు నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన.. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన