Rahul Murder: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసు అప్‌డేట్స్.. పక్కా స్కెచ్‌తోనే హత్య చేసినట్లు నిర్ధారణ.. అయితే..

Rahul Murder: యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ మర్డర్‌ ఎన్నో మలుపులు తిరుగుతోంది. పక్కా స్కెచ్‌తోనే అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Rahul Murder: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసు అప్‌డేట్స్.. పక్కా స్కెచ్‌తోనే హత్య చేసినట్లు నిర్ధారణ.. అయితే..
Rahul

Rahul Murder: యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ మర్డర్‌ ఎన్నో మలుపులు తిరుగుతోంది. పక్కా స్కెచ్‌తోనే అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే, నిందితులు ఎవరన్న దానిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండ్రోజుల క్రితం విజయవాడలో హత్యకు గురైన రాహుల్‌ కేసులో నిందితులుగా భావిస్తున్నవారు ఇప్పుడు పరారీలో ఉన్నారా? రాహుల్‌ తండ్రి డౌట్స్‌ ప్రకారం కేసు నడుస్తోందా..? లేక వేరే కోణం ఇంకేదైనా ఉందా..? కోరాడ విజయ్‌ ఎక్కడ ఉన్నాడు? రాష్ట్రం వదిలి పారిపోయాడా? అతడితోపాటు.. భార్య పద్మకూడా పరారీలో ఉందా? మూడో మనిషి గాయత్రి పాత్ర ఏంటి? ఇలా ఒక్క మర్డర్‌.. ఎన్నో ప్రశ్నలు.. ఇప్పటివరకు పోలీసులకు ఎన్నో చాలెంజ్‌లను విసురుతోంది ఈ దారుణ హత్య కేసు. చాలా స్మార్ట్‌గా చంపేసి పరార్‌ అయ్యారు నిందితులు. మరి ఇప్పటివరకు కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఆ ముగ్గురినీ ఎలా చేజ్‌ చేయబోతున్నారు?

వివరాల్లోకెళితే.. పారిశ్రామికవేత్త రాహుల్ కెనడాలో ఎంఎస్ చేశాడు. ఆ తరువాత స్వరాష్ట్రమైన ఏపీకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని 2015లో స్టార్ట్ చేశాడు. 2017లో జిక్సిన్ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ మొదలు పెట్టాడు. 2018లో జిక్సిన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌, 2019లో జిక్సిన్ పేపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ స్టార్ట్ చేశాడు. 2020లో జిక్సిన్ వెస్సల్స్ పేరుతో ఓ కంపెనీని పెట్టిన రాహుల్‌… ఈమధ్యే మరో కంపెనీకి శంకుస్థాపన చేశాడు. ఇలా జిక్సిన్‌ గ్రూప్‌కి ఎండీగా ఉన్న రాహుల్‌కి.. మరో ముగ్గురు భాగస్వాములు కూడా ఉన్నారు. వీరిలో కోరాడ విజయ్‌పైనే అందరికీ అనుమానం ఉంది. ఎందుకంటే.. రాహుల్‌ మర్డర్‌ తర్వాత విజయ్‌ పత్తాలేకుండా పోయాడు. బెంగళూరులో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. విజయవాడ, బెంగళూరుతోపాటు.. హైదరాబాద్‌, విశాఖలోనూ పోలీసు బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ప్రస్తుతం కోరాడ అనుచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

మరోవైపు ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కోగంటి సత్యంపైనా ఓ కన్నేసి ఉంచారు పోలీసులు. అతడి కదలికలపై నిఘా పెట్టారు. చెప్పే వరకు ఊరు విడిచి వెళ్లొద్దన్నారు హుకూం జారీ చేశారు పోలీసులు. అయితే, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సత్యం తెలిపాడు. ఇద్దరి మధ్య గొడవులు ఉన్నా.. అవి చంపుకునేంత వరకు వెళ్లలేదని స్పష్టం చేశాడు.

కాగా, ఈ కేసులో అనేక ప్రశ్నలు పోలీసులకు చాలెంజింగ్‌గా మారాయి. అసలు రాహుల్‌కి కోరాడ విజయ్‌ ఎలా పరిచయం? రాహుల్‌, కోరాడ విజయ్‌కి మధ్య జరిగిన లావాదేవీలేంటి? రాహుల్‌ని హనీట్రాప్‌ చేశారా? ఈ కేసులో గాయత్రి పాత్ర ఏంటి? విజయ్‌ భార్య పద్మ ఎక్కడ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే పరారీలో ఉన్న అనుమానితులు దరొకాల్సిందే. వీరు దొరికితే గానీ.. రాహుల్ హత్య కేసులో ఒక క్లారిటీ రాదని పోలీసు అధికారులు అంతర్గతంగా భావిస్తున్నారు.

కాగా, రాహుల్‌ పోస్టుమార్టమ్ సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. పోస్టుమార్గం తర్వాత డెడ్‌బాడీని ఒంగోలుకి తరలించారు. అక్కడే రాహుల్‌ అంత్యక్రియలు జరిగాయి. ఎంతోమందికి ఉపాధి కల్పించి పది మందికీ ఉపయోగపడుతున్న రాహుల్ ను కిరాతంగా చంపడం దారుణమంటున్నారు రాహుల్ మామయ్య.

Also read:

మంచు విష్ణు మరో షాక్..!’మా’ రచ్చ మళ్ళీనా..?హాట్ టాపిక్ గా మారిన విష్ణు ట్వీట్..:MAA Elections 2021 vIdeo.

Megastar Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్ డే కు మెగా సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మెహర్ రమేష్..

శింగనమల మండలంలో విషాదం.. కొండపై నుండి కాలుజారి పూజారి మృతి..Priest Falls Down Live Video.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu