Income Tax Raids on Dainik Bhaskar media groups: ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దైనిక్ గ్రూపు ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న ఆఫీసుల్లో ఆ సోదాలు సాగుతున్నాయి. దేశంలో ఉన్న దిన పత్రికల్లో దైనిక్ భాస్కర్ గ్రూపు చాలా పెద్దది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో.. చాలా దూకుడుగా ఈ పత్రిక రిపోర్టింగ్ చేసింది. మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను తప్పుపడుతూ లోతైన కథనాలను రాసింది. అధికారుల సోదాల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.