Pocso Act: టవల్ కట్టుకుని విద్యార్థినులకు పాఠ్యాంశాలు బోధించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏం జరిగిందంటే..

|

May 25, 2021 | 4:49 PM

Pocso Act: విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే.. వక్రబుద్ధితో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్శించాడు. చివరికి తాను చేసిన వెకిలి చేష్టలకు..

Pocso Act: టవల్ కట్టుకుని విద్యార్థినులకు పాఠ్యాంశాలు బోధించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏం జరిగిందంటే..
Follow us on

Pocso Act: విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే.. వక్రబుద్ధితో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్శించాడు. చివరికి తాను చేసిన వెకిలి చేష్టలకు తానే బలయ్యాడు. పోలీసులు ఆ కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చెన్నైలోని బాలా విద్యా భవన్ అనే పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ క్లాస్ సమయంలో ఒంటిపై కేవలం టవల్ మాత్రమే కట్టుకుని క్లాస్‌లు చెప్పాడు. ఆ ఉపాధ్యాయుడి చేష్టలతో విద్యార్థినిలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సదరు ఉపాధ్యాయుడు ఇప్పుడు మాత్రమే కాదు.. అనేకసార్లు ఇలా విద్యార్థినులతో అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించే వాడని బాధిత విద్యార్థినిలు వాపోయారు. దీనిపై పాఠశాల యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ప్రస్తుత విద్యార్థినిలే కాకుండా.. పూర్వ విద్యార్థినిలు కూడా ఆ కీచక ఉపాధ్యాయుడిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతేడాది ఆన్‌లైన్ క్లాస్‌ల సమయంలోనూ అతను ఇలాగే ప్రవర్తించాడని ఆరోపించారు. టవల్ పైనే పాఠ్యాంశాలు బోధించేవాడన్నారు. అంతేకాదు.. విద్యార్థినిల ఫోన్ నెంబర్లకు అసభ్యకరమైన మెజేస్‌లు పంపించేవాడన్నారు. ఉపాధ్యాయుడి అరాచకాలు మితిమీరడంతో పలువురు విద్యార్థినిలు సోషల్ మీడియా వేదికగా అతని అరాచకాలను బట్టబయలు చేశారు. అశ్లీలంగా బోధించిన వీడియో స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అతను పంపిన మెసేజ్‌ల తాలూకు స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు. ఈ స్క్రీన్ షాట్లను ‘మీ టూ’ ఉద్యమంలో పాల్గొన్న సింగర్ చిన్మయి, డీఎంకే ఎంపీ కనిమొళి సైతం షేర్ చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కీచక ఉపాధ్యాయునిపై పోలీసులు ఫోక్సో చట్టంలోని సెక్షన్ 12 సహా 67, 67(ఎ), 354(ఎ), 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతన్ని జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు. కాగా, ఉపాధ్యాయుడి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Also read:

FINANCIAL PACKAGE: కరోనా తాకిడికి ఆర్థిక రంగం కుదేలు.. ఉద్దీపన ప్యాకేజీ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం!