సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ-హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మాస్టర్ ఆఫ్ డిజైన్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఉత్తర్ ప్రదేశ్ వారణాసికి చెందిన మార్క్ ఆండ్రూ చార్లెస్ అనే విద్యార్థి మంగళవారం (జులై 2) మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
గది తలుపులు ఎంతకూ తెరవక పోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు పగుల గొట్టి చూడగా.. అప్పటికే విగతజీవిగా మారిపోయాడు. దీంతో ఐఐటీ ప్రాంగణంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చార్లెస్ ఇటీవలే సెకండియర్ పరీక్షలను పూర్తి చేశాడు. సంఘటన స్థలంలో ఐదు పేజీల సూసైడ్ నోట్‌ను గుర్తించిన పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.