AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవర్ కోసం సొంతింటికే కన్నం వేసిన యువతి!

సూర్యాపేట: సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడి కోసం ఓ యువతి తన సొంత ఇంటికే కన్నం వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే సుమారు రెండు నెలల క్రితం తాళ్లగడలోని ఓ ఇంట్లో 20 తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడి […]

లవర్ కోసం సొంతింటికే కన్నం వేసిన యువతి!
Ravi Kiran
|

Updated on: Jul 02, 2019 | 5:22 AM

Share

సూర్యాపేట: సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడి కోసం ఓ యువతి తన సొంత ఇంటికే కన్నం వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే సుమారు రెండు నెలల క్రితం తాళ్లగడలోని ఓ ఇంట్లో 20 తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడి మనవరాలే ఆ నగదు దొంగలించి యానాంలో ఉన్న తన ప్రియుడికి చేరవేసిన విషయం బయటపడింది.

తాళ్లగడ్డలో నివాసం ఉంటున్న తాతా అమ్మమ్మల వద్ద ఉంటూ ఆ యువతి స్థానిక ఫార్మాసిటికల్ కాలేజీలో ఎం-ఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు సోషల్ మీడియా ద్వారా 8 నెలల క్రితం యానాంకు చెందిన కర్రి సతీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా.. కొంతకాలానికి అది కాస్తా ప్రేమగా మారింది. జల్సాలకు బాగా అలవాటు పడ్డ సతీష్ మాయమాటలతో సదరు యువతిని నమ్మించి అవసరాల కోసం డబ్బులు అడిగేవాడు. ఆమె ఆ మాయగాడి మాటలు నమ్మి.. తాత ఇంటి బీరువాలో దాచిన సుమారు 20తులాల బంగారు అభరణాలు చోరీ చేసింది. ఇక అది ఎవరికి తెలియకుండా ప్రియుడికి చేరవేసింది. ఈ విషయం తెలియని తాత ఇంట్లో నగదు చోరీకి గురైనట్లు భావించి ఏప్రిల్ 14న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు రంగంలోకి దిగి.. అనుమానితులతో పాటు ఇంటివారిపై కూడా నిఘా పెట్టారు. అందులో భాగంగా ఫిర్యాదుదారుని మనవరాలే దొంగిలించి.. ఆ సొమ్మును యానాంలోని ఆమె ప్రియుడికి అందించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow Us
చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఫేమస్ హీరో
చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఫేమస్ హీరో
ఊరెళ్తున్నారా..? ఫ్రిజ్‌లో ఒక చెంచా పెట్టండి—కారణం తెలిస్తే షాక్
ఊరెళ్తున్నారా..? ఫ్రిజ్‌లో ఒక చెంచా పెట్టండి—కారణం తెలిస్తే షాక్
జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే..
జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే..
జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది
జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది
వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ?? పచ్చగా అవయవాలు ఎలా మారాయి?
వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ?? పచ్చగా అవయవాలు ఎలా మారాయి?
మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట
మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట
ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి
ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి
ఆ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారట! ఆ భయంకర రహస్యం ఇదే!!
ఆ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారట! ఆ భయంకర రహస్యం ఇదే!!
మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. ఇలా తెలుసుకోండి
మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. ఇలా తెలుసుకోండి
ఆ సినిమా నా కెరీర్ మార్చేసింది.. అప్పట్లోనే 4 కోట్ల కలెక్షన్స్..
ఆ సినిమా నా కెరీర్ మార్చేసింది.. అప్పట్లోనే 4 కోట్ల కలెక్షన్స్..