Sonu sood Fake Account: లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల పాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్ర పోషించి అందరినీ భయపెట్టే సోనూ.. నిజ జీవితంలో రియల్ హీరోగా మారాడు. కలియుగ దాన కర్ణుడిలాగా మారి ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా తమ కష్టాలను చెప్పుకున్న వారి అపద్భాందవుడిగా మారిన సోనూసూద్ సాయం చేశాడు. ఈ క్రమంలోనే సోనూకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా దేవుడిగా మార్చి గుడినే నిర్మించారు.
అయితే సోనూసూద్ చేస్తోన్న ఈ గొప్ప పనిని కూడా ఓ ప్రబుద్ధుడు తన నేరానికి ఉపయోగించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఆశిష్ కుమార్ అనే ఓ యువకుడు సోనూ సూద్ పేరితో ఓ ఫేస్‌బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. దీంతో ఆ ఐడీని నిజమైన ప్రొఫైల్‌గా భావించిన కొందరు ఆపదలో ఉన్న వ్యక్తులు సాయం చేయమంటూ రిక్వెస్ట్‌లు పెట్టారు. అయితే వారిని సాయం చేస్తానంటూ నమ్మించిన ఆశిష్.. బాధితుల నుంచే భారీగా డబ్బులు వసూలు చేశాడు. దీంతో సాయం పొందాలని భావించిన బాధితులు సహాయాన్ని పొందక పోగా.. రివర్స్‌లో తమ డబ్బులను కూడా పొగొట్టుకున్నారు. ఈ విషయం అర్థమైన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. ఇక నిందితుడు ఆశిష్‌ను సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మద్యం మత్తులో రెచ్చిపోతున్న మందుబాబులు.. పెరుగుతున్న ప్రమాదాలు.. తాగుబోతుల్లో ఎక్కువ శాతం వారే..!
Attempt To Break ATM: గచ్చిబౌలిలో ఏటీఎమ్ చోరీకి యత్నించిన ఆగంతకుడు.. ఫొటోలు షేర్ చేసిన పోలీసులు..