ఏరోనాటికల్‌ ఇంజినీర్.. కిడ్నీల బ్రోకరయ్యాడు..

అతను ఓ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌. చదువులో టాపర్‌. బడా సంస్థల్లో ఉద్యోగం చేశాడు. చెడు అలవాట్లు, అత్యాశ అతణ్ని తప్పుదారి పట్టించాయి. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి తన కిడ్నీ అమ్ముకోవడమే కాదు.. అదే వ్యాపారంగా ఎంచుకున్నాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు. తాజాగా ఓ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో బంజారాహిల్స్‌ పోలీసులకు..

ఏరోనాటికల్‌ ఇంజినీర్.. కిడ్నీల బ్రోకరయ్యాడు..

Edited By:

Updated on: Jul 19, 2020 | 1:38 PM

అతను ఓ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌. చదువులో టాపర్‌. బడా సంస్థల్లో ఉద్యోగం చేశాడు. చెడు అలవాట్లు, అత్యాశ అతణ్ని తప్పుదారి పట్టించాయి. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి తన కిడ్నీ అమ్ముకోవడమే కాదు.. అదే వ్యాపారంగా ఎంచుకున్నాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు. తాజాగా ఓ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో బంజారాహిల్స్‌ పోలీసులకు చిక్కాడు. పశ్చిమ మండల DCP ఏఆర్‌ శ్రీనివాస్‌ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్లో నిందితుడి వివరాలు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని అరండల్‌పేట ప్రాంతానికి చెందిన డోగిపర్తి షణ్ముఖ పవన్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్ చదివాడు. బీటెక్‌లో‌ 93 శాతం మార్కులు సాధించాడు. మార్కులకు తగ్గుట్టుగానే బెంగుళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ వచ్చింది. HAL అనే సంస్థలో ఆరు నెలల పాటు పని చేశాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి రాంకోఠిలో బీపీఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. అందులో నష్టాలు రావడంతో, ఆదిభట్లలోని టాటాలో చేరాడు. హైదరాబాద్‌లో స్థలం కొనుగోలుకు తన బావ ఇచ్చిన 11 లక్షలను షేర్లలో పెట్టాడు.

అంతా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి.. ఇంటర్‌నెట్‌ సర్చ్‌ చేయగా.. ఆ సమయంలోనే కిడ్నీ కావాలంటూ కొన్ని యాడ్స్‌ చూశాడు. పుణెలో ఉన్న మధ్యవర్తి ద్వారా 4 లక్ష 70 వేలకు తన కిడ్నీ విక్రయించాడు. ఈ సందర్భంగా పరిచయమైన నందకిశోర్‌తో కలిసి కిడ్నీ స్వీ కర్తల వివరాలు ఇంటర్‌నెట్‌లో సేకరించి, దాతలను గుర్తించేవారు. పుణె తీసుకెళ్లి పరీక్షలు చేయించేవారు. శ్రీలంక, టర్కీలోని ఆసుపత్రులతో మాట్లాడుకొని అక్కడికి దాతలను, స్వీ కర్తలను తీసుకెళ్లి కిడ్నీ మార్పిడి చేయించే వాడు. వచ్చిన డబ్బుతో గోవా వెళ్లి జల్సాలు చేసేవాడు. 2016లో అహ్మదాబాద్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో పట్టుబడిన నందకిషోర్‌, శ్రీనివాస్‌ రెండున్నరేళ్ల జైలుశిక్ష అనుభవించారు. అయినా వారికి బుద్ధి మారలేదు.

తాజాగా హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన బిజ్జాల నాగరాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్‌కు వెళ్లే సమయంలో శ్రీనివాస్‌  పరిచయమయ్యాడు. టర్కీలో కిడ్నీలు మార్పిస్తానని.. 34 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. స్నేహితుడు సృజన్‌తో కలిసి ఆ సొమ్ము తీసుకొన్నాడు. కిడ్నీ దాత, స్వీకర్తలకు విమాన టిక్కెట్లు తీసుకోకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో గుట్టురట్టయింది.

Read More:

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి

పవన్‌‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్