ఉప్పల్ వైన్స్‌ సిబ్బంది అకృత్యం, కస్టమర్ పై విచక్షణా రహితంగా దాడి, రాత్రివేళ కుప్పకూలిపోయిన వికాస్ అనే యువకుడు

హైదరాబాద్ ఉప్పల్ మహంకాళి వైన్స్ లో దారుణం చోటు చేసుకుంది. వికాస్ అనే వ్యక్తి పై వైన్స్ లో పనిచేసే సిబ్బంది తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే, వికాస్, మహేష్ అనే ఇద్దరు స్నేహితులు..

ఉప్పల్ వైన్స్‌ సిబ్బంది అకృత్యం,  కస్టమర్ పై విచక్షణా రహితంగా దాడి, రాత్రివేళ కుప్పకూలిపోయిన వికాస్ అనే యువకుడు

హైదరాబాద్ ఉప్పల్ మహంకాళి వైన్స్ లో దారుణం చోటు చేసుకుంది. వికాస్ అనే వ్యక్తి పై వైన్స్ లో పనిచేసే సిబ్బంది తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే, వికాస్, మహేష్ అనే ఇద్దరు స్నేహితులు మద్యం తాగడానికి ఆదివారం రాత్రి మహంకాళి వైన్స్ కు వెళ్లారు. వైన్స్ షాప్ లోని సిట్టింగ్ రూంలో ఇద్దరు కలిసి మద్యం సేవిస్తూ ఆమ్లెట్ వేయించుకున్నారు. డబ్బుల విషయంలో ఆమ్లెట్ వేసే వ్యక్తి తో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వైన్స్ సిబ్బంది అందరూ కలిసి వికాస్, మహేష్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడి నుండి తప్పించుకొని బయటికి వచ్చిన వికాస్ రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే మెడికల్ షాప్ లో పెయిన్ కిల్లర్ ట్యాబ్ లెట్ తీసుకొని వేసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత వికాస్ మృతి చెందాడు.

ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని వైన్స్ లో పనిచేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వికాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించారు. వైన్ షాప్ లో ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వికాస్ లంగర్ హౌస్ కు చెందిన వాడుగా గుర్తించారు పోలీసులు. వికాస్ కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని మహంకాళి వైన్స్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు.

బీజేపీ – టీఆర్‌ఎస్‌లు మిత్రపక్షాలే, వారి ప్రయాణం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ : మనిక్కం ఠాకూర్