కరోనా బాధితుడి ఇంటికే కన్నం వేసిన దొంగలు..!

హైదరాబాద్‌లోని కరోనా బాధితుడి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స. పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలను కూడా క్వారంటైన్‌లో ఉంచారు.

కరోనా బాధితుడి ఇంటికే కన్నం వేసిన దొంగలు..!

Edited By:

Updated on: Jun 04, 2020 | 6:17 PM

కరోనా వైరస్ ఆ ఇంటిల్లిపాదిని ఆస్పత్రిపాలు చేస్తే.. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇల్లు గుల్ల చేశారు. హైదరాబాద్‌లోని కరోనా బాధితుడి ఇంట్లో చోరీ జరిగింది. సికింద్రాబాద్‌ పరిధిలోని అల్వాల్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగికి గత నెల 11న కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని భార్య, ఇద్దరు పిల్లలను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. అయితే కరోనా నుంచి కోలుకున్న కుటుంబం ఇరవై రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. ఇంటి తాళాలు తెరిచినవారికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి కనిపించాయి. దీంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో దాచిన పది తులాల బంగారం, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యాయని పోలీసులు తెలిపారు. అసలే అనారోగ్యంతో కుదేలైన ఆ కుటుంబం దొంగతనంతో మరింత కుంగిపోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us