సైదాబాద్ రాక్షకుడిని పట్టుకునేందుకు మరిన్ని క్లూస్.. గుండు చేయించుకుంటే ఇలా ఉంటాడు..

|

Sep 15, 2021 | 4:21 PM

Hyderabad Crime News: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర హత్యాచారం ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంరేపుతోంది.

సైదాబాద్ రాక్షకుడిని పట్టుకునేందుకు మరిన్ని క్లూస్.. గుండు చేయించుకుంటే ఇలా ఉంటాడు..
Saidabad Rape And Murder Case
Follow us on

Hyderabad Crime News: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర హత్యాచారం ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంరేపుతోంది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రాజు ఆచూకీకి సంబంధించి సమాచారం ఇచ్చే వారికి రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీసులు ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌ను స్వయంగా రాష్ట్ర డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు సెల్‌ఫోన్ వాడకపోవడంతో ఆచూకీ గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. దీంతో సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సైదాబాద్ నిందితుడు, మోస్ట్ వాంటెడ్ రాజుకు సంబంధించి మరిన్ని ఫోటోలు, క్లూస్‌ని హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేశారు. ఆ మేరకు రెండు ట్వీట్స్ చేశారు. ఎవరూ తనను గుర్తించకుండా గుండు చేయించుకుని ఉంటే ఎలా ఉంటాడన్న దానిపై ఓ ఊహా చిత్రాన్ని కూడా పోలీసులు విడుదల చేశారు. అలాగే నిందితుడి చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు ఉంటుంది.

సైదాబాద్ హత్యాచార కేసు నిందితుడు రాజు ఆచూకీపై సమాచారం ఇచ్చేవారికి హైదరాబాద్ పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు ప్రకటించడం తెలిసిందే. అతని ఆచూకీపై డీసీపీ(ఈస్ట్ జోన్)- 9490616366, డీసీపీ(టాస్క్ ఫోర్స్)- 9490616627కు సమాచారమివ్వాలని పోలీసులు కోరారు.

సీసీటీవీ ఫుటేజీ దర్యాప్తులో కీలకం..

సీసీటీవీల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాదాపు 1000 సీసీటీవీ కెమెరాల డేటాను అనాలసిస్ చేస్తున్నారు. నిందితుడు ఉప్పల్ వరకు వెళ్లినట్లు గుర్తించారు. ఉప్పల్ సిగ్నల్ దగ్గర నిందితుడు రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అక్కడ ఓ వైన్ షాపు దగ్గర తన చేతిలో ఉన్న కవర్‌ను రాజు పడేశాడు. ఈ కవర్‌ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కవర్‌లో కల్లు సీసా, టవల్ స్వాధీనం చేసుకున్నారు. రాజు చేతిలో రూ.700లు ఉన్నట్లు భావిస్తున్నారు. దాదాపు 180 వైన్ షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. రాత్రిలోగా నిందితుడు రాజును పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిందితుడు రాజు ఫోటో ని చూపెట్టి పోలీసులు ప్రచారం చేస్తున్నారు.

Also Read..

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ ఆఫీసుకు సినీ తారల క్యూ.. సెల్ఫీల ఫ్యాన్స్ గోల..

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట.. రఘురామ కృష్ణంరాజు పిటీషన్‌ తిరస్కరణ