Hyderabad: ఓల్డ్‌ సిటీ మర్డర్‌ కేసులో ఎస్‌ఐపై వేటు.. ప్రాణ హాని ఉందని చెప్పిన పట్టించుకోలేదని..

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసట్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన దారుణ హత్య తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. హస్మాబాద్ బండ్ల గూడ రోడ్డు పై హమీద్‌ అనే వ్యక్తిని...

Hyderabad: ఓల్డ్‌ సిటీ మర్డర్‌ కేసులో ఎస్‌ఐపై వేటు.. ప్రాణ హాని ఉందని చెప్పిన పట్టించుకోలేదని..

Updated on: Oct 14, 2021 | 9:23 AM

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసట్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన దారుణ హత్య తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. హస్మాబాద్ బండ్ల గూడ రోడ్డు పై హమీద్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు వేటాడి దారుణంగా హత్య చేశారు. కారులో ఉన్న హమీద్‌ను బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో పాతబస్తీలో భయాందోళనకు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరణించిన హమీద్‌ గురువారం ఉదయం తనకు ప్రాణహాని ఉందని పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎస్‌ఐ వెంకటేష్‌ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఎస్‌ఐ వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎస్‌ఐ పట్టించుకొని ఉంటే.. ఈ హత్య జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన హైపర్ ఆది.. ఒక్క ఎపిసోడ్ కోసం ఎంత రెమ్యునరేష్ తీసుకున్నాడో తెలుసా..

South China Sea: సౌత్ చైనా సముద్ర గర్భంలో అలజడి.. అమెరికా జ‌లాంతర్గామికి ప్రమాదం.. వీడియో

Ramnath kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సంచలన నిర్ణయం.. సాంప్రదాయానికి భిన్నంగా దసరా వేడుకలు.. ఎక్కడంటే..?